CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
CPM | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల తెలంగాణలో కరువు ఏర్పడి పంటలు నష్టపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు.
తాండూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల తెలంగాణలో కరువు ఏర్పడి పంటలు నష్టపోయాయని సీపీఎం ( CPM ) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( John Wesley) ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం తక్షణమే రూ. 50వేల కోట్ల నష్టపరిహారం ( Compensation ) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గురువారం తాండూర్ మండలంలో సీపీఎం రాష్ట్ర బృందం కరువు వల్ల నష్టపోయిన రైతుల పత్తి పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణలో కరువు తాండవిస్తున్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో నిర్థిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో 11 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ అందులో తాండూర్ మండలం ప్రకటించలేదని పేర్కొన్నారు.
నష్టపోయిన వాణిజ్య పంటలకు 50వేలు, ఆహార పంటలకు 30 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, కరువు నేపథ్యంలో నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీపై 14 రకాల సరుకులు రేషన్ ద్వారా ఇవ్వాలని, ఉపాధి హామీ సంవత్సరానికి 200 రోజులు కల్పించి రోజుకి 800 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఎంవీ రమణ, ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నగేష్, జిల్లా కార్యదర్శి బోడంకి చందు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, గుమసా అశోక్, తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం,జిల్లా కమిటీ సభ్యులు సాంబార్ వెంకటస్వామి, దాగం శ్రీకాంత్ పాయిరాల రాములు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

