పారిశ్రామిక ప్రగతిపై ఆశలు

- వ్యవసాయ, సిమెంట్ ఆధారిత పరిశ్రమలకు అవకాశం
- అందుబాటులో భూములు, ముడిసరుకులు
- ఇప్పటికే 13 పరిశ్రమలకు 12.46 కోట్ల సబ్సిడీ
- తాజాగా 2021-22లో నాలుగు పరిశ్రమల కోసం దరఖాస్తులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 2, నమస్తే తెలంగాణ : జిల్లా లో ఉన్న అపారమైన సహాజవనరులను వినియోగించుకుంటే జిల్లా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం టీఎస్ ఐపాస్(ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్), టీ-ఐడీఈఏటీ-ఐడీఈఏ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్పెన్యుయిర్ అడ్వాన్స్మెంట్), టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆప్ డైలిట్ ఇంటర్ ప్రెన్యుయిర్(టీ-పీఆర్ఐడీఈ) పథకాల ద్వారా చేయూతనందిస్తోంది. ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన సంస్థలు పరిశ్రమలు స్థాపించి 262 మందికి ఉపాధిని కల్పించేందుకు అనుమతులు పొందాయి. అలాగే టీ-ప్రైడ్, టీ-ఐడీఈఏల ద్వారా 13 మంది దరఖాస్తులు చేసుకున్న వారికి రూ. 12.46 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా.. 2020-21 సంవత్సరానికి టీఎస్ ఐపాస్ ద్వారా 54 దరఖాస్తులు రాగా, వాటిలో 37 యూనిట్ల స్థాపన కోసం వివిధ శాఖల ద్వారా అనుమతులు వచ్చాయి. తాజాగా 2021-22 సంవత్సరంలో 4 పరిశ్రమల స్థాపనలకోసం దరఖాస్తులు వచ్చాయి.
పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు..
నాలుగున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మళ్లీ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతుందనే ఆశాభావంతో జిల్లా వాసులు ఉన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములతోపాటు పరిశ్రమలకు కావాల్సిన ముడిసరులు, మానవ వనరులు కూడా అందుబాటులో ఉండడం కలిసివచ్చే అంశం. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన లెటరైట్, బంకమట్టి, సున్నపురాయి, మాంగనీసు వంటి ముడిసరుకు ఉన్న భూములను అధికారులు గతంలోనే గుర్తించారు.
292 హెక్టార్లలో..
జిల్లాలోని దహెగాం, రెబ్బెన, తిర్యాణి, వాంకిడి, కౌటాల, కెరమెరి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో బొగ్గు, సున్నపురాయి, బంకమన్ను, రోడ్లు భవన నిర్మాణాల్లో వినియోగించే కంకర రాయి నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. దహెగాం మండలం గొర్రిగుట్ట, బోర్లకుంట, రెబ్బెన మండలం నారాయణపూర్ పరిసరాల్లోని ప్రభుత్వ భూముల్లో దాదాపు 292 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. మంచిర్యాల నుంచి వాంకిడి మీదుగా చంద్రాపూర్ వరకు ఉన్న రవా ణ సదుపాయం జిల్లా పారిశ్రామిక రంగానికి కూడా కలిసివస్తుంది. జిల్లాలో ఉన్న అపార ఖనిజవనరుల దృష్ట్యా పారిశ్రామిక వ్యాపార వేత్తలుకూడా ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

