వెయ్యి చిత్రాల దర్శకుడు
ఎనిమిదేండ్లు అంటే 2,922 రోజులు. ఈ కాలంలో ఆయన దర్శకత్వం వహించిన లఘు చిత్రాలు 1,000. అంటే సుమారు మూడు రోజులకు ఒక చిట్టి చిత్రాన్ని తీసి ‘ఔరా!’ అనిపించుకున్నాడు రామ్ మోగిలోజి.
ఎనిమిదేండ్లు అంటే 2,922 రోజులు. ఈ కాలంలో ఆయన దర్శకత్వం వహించిన లఘు చిత్రాలు 1,000. అంటే సుమారు మూడు రోజులకు ఒక చిట్టి చిత్రాన్ని తీసి ‘ఔరా!’ అనిపించుకున్నాడు రామ్ మోగిలోజి. అంతేకాదు 1,500కు పైగా లఘుచిత్రాలకు ఎడిటర్‌గా కూడా వ్యవహరించాడు. కంప్యూటర్ టీచర్‌గా, మల్టీమీడియా, యానిమేషన్ ట్యూటర్‌గా ఎంతోమంది విద్యార్థులను వీడియో ఎడిటర్లుగా తీర్చిదిద్దాడు.
కరీంనగర్‌కు చెందిన రామ్ మోగిలోజి 2014 నుంచి లఘు చిత్రాల దర్శకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. తెలుగు భాష, తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తూ.. వీటిని నిర్మిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్ నంద పరిచయం తనను లఘుచిత్రాల వైపు నడిపించిందని చెబుతాడు రామ్ మోగిలోజి. ఆయన చిత్రాల్లో మానవ సంబంధాలు, పల్లె వాతావరణం కథాంశాలుగా కనిపిస్తాయి. హాస్యరసభరితంగా సాగే ఈ చిత్రాల్లో అంతర్లీనంగా చక్కని సందేశం దాగి ఉంటుంది.
తను నిర్మించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆషాఢం అల్లుడు అత్త లొల్లి, ఇరికిల్లు ఇద్దరు పెళ్లాలు, ప్రేమించే పెనిమిటి, వార్డ్ మెంబర్ శ్రీనన్న.. ఇలా పలు లఘు చిత్రాలు ఎక్కువ ఆదరణ పొందాయి. ఇప్పటివరకు 1,000కి పైగా లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1,500 పైచిలుకు షార్ట్‌ఫిల్మ్స్ ఎడిటింగ్ చేశాడు. ఒక చలన చిత్రానికి పూర్తిస్థాయి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. రెండున్నర వేల ప్రకటనలకు, 150 జానపద గీతాలకు దర్శకుడిగా వ్యవహరించాడు.
30కి పైగా డాక్యుమెంటరీలు నిర్మించాడు. ఇటీవల తన 1000వ లఘుచిత్రంగా ‘మై గవర్నమెంట్ స్కూల్’ కథను ఎంచుకున్నాడు. ఇందులో గతంలో ప్రభుత్వ పాఠశాలల వైభవం, వాటిని విద్యార్థులు ఆదరించిన తీరును కండ్లకుకట్టాడు. షార్ట్‌ఫిల్మ్ జర్నీలో రామ్‌ను ఎన్నో పురస్కారాలు వరించాయి. గిడుగు రామమూర్తి కీర్తి సేవ పురసారం అందుకున్నాడు. ఆర్టీసీ షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి అందుకోడం ఆనందాన్ని ఇచ్చిందని చెబుతారు రామ్ మోగిలోజి.
…? వీర్ల రంజిత్ రంగా
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

