డిస్నీప్లస్ హాట్‌స్టార్-18 సెప్టెంబర్
తారాగణం: టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేశ్ తైలాంగ్ తదితరులు.
దర్శకుడు: విక్రాంత్ పవార్
ఇటీవల ఓటీటీలో విడుదలైన హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది ‘దహన్’. సైన్స్, సూపర్ నేచురల్ పవర్స్ మధ్య జరిగే ఉత్కంఠభరితమైన కథ ఇది. రాజస్థాన్ శిలాస్పుర నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ పట్టణాన్ని రాక్షసుడైన
రిధియాకన్ రక్షిస్తుంటాడని అక్కడి ప్రజల నమ్మకం. పర్వతాల నడుమ ఏకశిలలో సుప్త చేతనావస్థలో ఉన్న రిధియాకన్ తన ఉనికినే భంగపరిచే సందర్భం వచ్చినప్పుడు ప్రళయం సృష్టిస్తాడని అక్కడివారు విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ గుహల్లో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఈ వ్యవహారాల్ని పర్యవేక్షించడానికి మహిళా ఐఏఎస్ అధికారి అవని రౌత్ (టిస్కా చోప్రా) అక్కడికి వస్తుంది. ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించే ఆమె మైనింగ్ వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, జీవితాలు మారిపోతాయని భరోసా ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ వల్ల బద్దలైన కొండల గర్భం నుంచి బయటికొచ్చిన రాకాన్స్ (రాక్షసులు) ఎలాంటి భయోత్పాతాన్ని సృష్టించారన్నదే ఈ సిరీస్ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి నచ్చుతుంది. దక్షిణాది భాషల్లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.