చేతి గడియారాలు ఫ్యాషన్‌లో, అలంకరణలో ఓ భాగం ఇప్పుడు.కొనుగోలుదారుల అభిరుచికి తగినట్టు మార్కెట్లో కొత్తకొత్త డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని లగ్జరీ కంపెనీలు ‘రివర్సబుల్’ వాచీలను కూడా తీసుకొచ్చాయి. వీటిలో ఒకవైపు సమయం కనిపిస్తుంది, మరోవైపు అందమైన ఆర్ట్‌వర్క్ కనువిందు చేస్తుంది. ఎనామిల్ రంగులు, రాళ్లు, పూల సొగసులతో కూడిన చిత్రాలు వైవిధ్యంగా నిలుస్తాయి. దేవతామూర్తులు, మృగాల ఆకృతులు ఒద్దికగా ఇమిడిపోతున్నాయి.
ఇక స్మార్ట్ వాచీలో సాంకేతిక విలువలు ఉంటే ఉండవచ్చు కానీ, మగువలకు నచ్చే తళుకుబెళుకులు శూన్యం. దీంతో జువెలరీ జతచేసి మరీ స్మార్ట్ వాచీలను ఆవిష్కరిస్తున్నాయి తయారీ సంస్థలు. విడిగా చెయిన్ స్ట్రాపులు, ఇతర యాక్సెసరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. పూలు, సీతాకోకచిలుకలు వంటి ఆకట్టుకునే పెండెంట్లతో గడియారాలను నచ్చినట్టు అమర్చుకోవచ్చు.