నేను సగం.. నువ్వు సగం!
ఆభరణాలు ధరించడంలో అందం ఉంది, ఆనందమూ ఉంది. స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్ల్లు..
ఆభరణాలు ధరించడంలో అందం ఉంది, ఆనందమూ ఉంది. స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్ల్లు.. ఒక్కో బంధానిది ఓ ప్రత్యేకత. ఆ అనుబంధంతో ముడిపడిన జ్ఞాపకాలను ఆభరణాలుగా మలుచుకుంటున్నారు చాలామంది. ఈ నగలు ఫ్రెండ్స్ జువెలరీ, కపుల్ జువెలరీ, బెస్టీ జువెలరీ పేరున అలరిస్తున్నాయి.

పెండ్లి, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా రకరకాల కారణాలతో స్నేహితులు, తోబుట్టువులు, ప్రేమికులు, కొన్నిసార్లు దంపతులు కూడా దూరంగా బతకాల్సి వస్తున్నది. ‘భౌతికంగా మనమధ్య ఎడబాటు అనివార్యమైనా, మానసికంగా మాత్రం అతిదగ్గరగా ఉంటున్నాం’ అని చాటుకోవడానికి ‘సగం..సగం’ తరహా నగలను ఎంచుకుంటున్నారు చాలామంది. నువ్వు సగం, నేను సగం.. అన్న విషయాన్ని ప్రతీకాత్మకంగా చాటుకోవడానికి ఒకే నగను రెండు ముక్కలుగా చేసుకుని.. చెరొకటి ధరిస్తున్నారు. పేర్లు, పదాల లాకెట్స్ కూడా వస్తున్నాయి.
సీతాకోక చిలుక, తాళంచెవి, పూలు, ఆకులు.. ఇలా రకరకాల డిజైన్లతో పెండెంట్లు వస్తున్నాయి. ఎన్ని ఉన్నా ఈ జువెలరీలో హృదయాకారానిదే హవా. స్నేహితులంటే ఇద్దరే కాకపోవచ్చు. ముగ్గురు, నలుగురు కూడా ఉండవచ్చు. ఆ మిత్రబృందం కోసం కూడా అందమైన పెండెంట్లు లభిస్తున్నాయి. ఉంగరాలు, బ్రేస్లెట్లు, గాజుల్లోనూ ఈ చిహ్నాలు ఒదిగిపోతున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటి ఖరీదైన లోహాల్లోనే కాదు, ఈతరానికి నప్పేలా.. త్రెడ్, ఫ్యాబ్రిక్, లైట్‌వెయిట్, వన్‌గ్రామ్ గోల్డ్ వంటి వాటిలోనూ అందుబాటులో ఉన్నాయి.. ఫిఫ్టీ ఫిఫ్టీ ఆభరణాలు.

Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

