మీ ఫ్రీడమ్ ఫండ్ రెడీనా?
నేటితరం అమ్మాయిలు కేవలం ఉద్యోగం సంపాదించడమే కాదు, తమకంటూ ఒక ‘ఆర్థిక సామ్రాజ్యాన్ని’ నిర్మించుకోవడంలో దూసుకుపోతున్నారు. అయితే, సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన రీతిలో దాచుకోవడం అంతే అవసరం. మన చేతిలో ఉండే డబ్బు సమాజంలో గౌరవాన్ని మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎవరి ముందూ తలవంచకుండా నిలబడే ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది.
నేటితరం అమ్మాయిలు కేవలం ఉద్యోగం సంపాదించడమే కాదు, తమకంటూ ఒక ‘ఆర్థిక సామ్రాజ్యాన్ని’ నిర్మించుకోవడంలో దూసుకుపోతున్నారు. అయితే, సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన రీతిలో దాచుకోవడం అంతే అవసరం. మన చేతిలో ఉండే డబ్బు సమాజంలో గౌరవాన్ని మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎవరి ముందూ తలవంచకుండా నిలబడే ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది. దీన్నే మనం ‘ఫ్రీడమ్ ఫండ్’ అనుకోవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హఠాత్తుగా ఉద్యోగం మారాల్సి రావడం, కెరీర్లో బ్రేక్ తీసుకోవడం లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఫండ్ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మరి దాన్ని ఎలా సమకూర్చుకోవచ్చంటే … బడ్జెట్ ప్లానింగ్: ప్రతి నెల సంపాదనలో కనీసం 20 శాతం పొదుపు ఖాతాలోకి వెళ్లేలా చూసుకోవాలి. పెట్టుబడులపై అవగాహన: బంగారం మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడుల పైనా అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో భాగస్వామ్యం : ఇంట్లో ఆర్థిక నిర్ణయాల్లో మీరు కూడా పాలుపంచుకుంటూ ఎక్కడ ఖర్చు తగ్గించవచ్చో ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలి. అవకాశం ఉన్నప్పుడు ఫ్రీ లాన్సింగ్ వర్కులు చేయడంతో పాటు అనవసరమైన షాపింగ్ తగ్గించుకోవడం కూడా కొత్త సంపాదన మార్గమే!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

