ఏ వయసులో పెండ్లి ?

నా వయసు ఇరవై మూడు. అమ్మానాన్న నాకు పెండ్లి చేయాలనుకొంటున్నారు. ఇంత త్వరగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఏ వయసులో చేసుకొంటే వివాహ బంధం బలంగా ఉంటుంది?
ప్రేరణ, హైదరాబాద్
భారతదేశంలో చట్టబద్ధమైన వివాహానికి అబ్బాయికైతే 21 ఏండ్లు, అమ్మాయికైతే 18 ఏండ్లు నిండితే చాలు. అయితే, ఆ వయసే ప్రామాణికమని చెప్పలేం. ఏ వయసులో వివాహం చేసుకోవాలన్నది పూర్తి వ్యక్తిగతం. మన సంస్కృతిలో పెండ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం కుటుంబ వ్యవస్థకు విలువనిస్తాం. కాబట్టి, వివాహం అనేది జీవితంలో మైలురాయి లాంటిది. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా మొదట పెండ్లి తర్వాత వచ్చే బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చదువు, జీవితానుభవం, ఆర్థిక స్థిరత్వం మొదలైనవి బలమైన వివాహానికి పునాదులు. ఆలస్యంగా జరిగే పెండ్లిళ్లే ఎక్కువకాలం నిలుస్తాయని, 25-29 ఏండ్ల మధ్యలో పెండ్లి చేసుకోవడం ఉత్తమమని ఓ అభిప్రాయం. నిజానికి, యుక్త వయసులో భావోద్వేగాలు ఒకేతీరుగా ఉండవు. ఒకటేమిటి, ఎన్ని రకాలుగా చూసుకున్నా పెండ్లి అనేది పాతిక తర్వాత అయితేనే, దాంపత్య బంధాన్ని అర్థం చేసుకోగలరు.
రాధిక నల్లన్ ఆచార్య
క్లినికల్ సైకాలజిస్ట్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

