సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతున్నా!

మొదటినుంచీ నాకు అందరితో కలిసి పోవడం అలవాటు. తోటివాళ్ల నిర్ణయాలను గౌరవిస్తాను. వాళ్లకు లొంగినట్టు ఉంటాను. అయితే, దీన్ని చాలామంది అలుసుగా తీసుకుని నాపై హక్కు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినట్లు తెలిస్తే, చాలా బాధేస్తుంది. నా ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో చెప్పండి. – ఓ సోదరి
అందరికీ లొంగినట్లు ప్రవర్తించడం సమర్థించాల్సిన విషయం కాదు. దానివల్ల జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ. ప్రతి దానికీ ఇతరుల నిర్ణయాలపై ఆధార పడతారు. సొంత కాళ్లపై నిలబడలేరు. ఈ ధోరణులు తమను తాము తక్కువగా అనుకోవడం, లోలోపలే కోపంతో రగిలి పోవడం, మానసికంగా కుంగిపోవడం.. వంటి మానసిక రుగ్మతలకు దారితీస్తాయి. ప్రతి దానికీ అవతలి వాళ్లను బతిమిలాడే వాళ్లకు సమాజంలో గౌరవం లభించదు. మీ ప్రవర్తనను క్రమంగా మార్చుకోవాలి. ఇతరుల నిర్ణయాలపై ఆధార పడితే, ఇతరుల కోసమే బతకాల్సి వస్తుంది. ఎంతో ఇష్టమైన విషయాల్లో కూడా రాజీపడాల్సి ఉంటుంది. మీ అభిప్రాయాలకు ఎలాంటి విలువా ఉండదు. ఏం చెప్పినా అవతలి వాళ్లు సీరియస్గా తీసుకోరు. కష్టపడి చేసిన పనులకూ గుర్తింపు లభించదు. ఫలితంగా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. క్రిటికల్ థింకింగ్, బాధ్యతాయుత ప్రవర్తన ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ముందుగా, ఆత్మస్థయిర్యం పెంచుకోవాలి. భయాన్ని వీడాలి. దృఢంగా ఉండాలి. అప్పుడే, మీరు లక్ష్యాన్ని సాధిస్తారు.
రాధిక నల్లన్ ఆచార్య
క్లినికల్ సైకాలజిస్ట్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

