లెన్స్-మేకప్ ఐ లైనర్!

మేకప్ వేసుకొని మరింత అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. మేకప్ విషయంలో అందరిలా కాకుండా కళ్లకు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆయిల్ బేస్డ్ వద్దు
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతులద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, మేకప్ ప్రాడక్ట్స్ కొనేటప్పుడు, ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఎందుకంటే, ఆయిలీ ప్రొడక్ట్స్ వాడితే.. అవి కళ్లకు పాకి లెన్స్ ఇరిటేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కుదిరితే, వాటర్ బేస్డ్ ఫౌండేషన్ తీసుకుని పత్తి లేదా సాఫ్ట్ బ్రష్‌తో వేసుకోవాలి.
మేకప్ వేసుకున్నాకే లెన్స్
చాలామంది లెన్స్, మేకప్‌లలో ఏది ముందు వేసుకోవాలో తెలియక పొరపాటు చేస్తారు. మేకప్ వేసుకున్నాక లెన్స్ పెట్టుకుంటే, అది పాడయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, ముందుగా లెన్స్ పెట్టుకోవాలి. తర్వాత జాగ్రత్తగా మేకప్ వేసుకోవాలి. అలా కొద్దిసేపు కళ్లు మూసుకున్నా లెన్స్ మంచిగా సెట్ అవుతాయి.
ఐ లైనర్‌తో జాగ్రత్త
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవాళ్లు ఐ లైనర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బేస్డ్ ఐ లైనర్, ఐ షాడో మాత్రమే తీసుకోవాలి. పైగా అది లెన్స్‌కి తగులకుండా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, మేకప్కన్నా కంటిచూపే ప్రధానమని గుర్తించాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Eye liner
- lens make up
- Makup
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

