Therapy with stones | రాళ్లతో.. కిరణ చికిత్స!

ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా ఏ పని మీదా దృష్టి సారించలేం. అలాంటిది నిత్యం కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పితో ఇబ్బంది పడేవాళ్లకు ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. అలాంటి సమస్యలకు ‘స్టోన్ థెరపీ’లో పరిష్కారం ఉందని సూచి స్తున్నారు నిపుణులు. అందులోనూ ఆరుష్ రాళ్లకు స్వస్థతను ప్రసాదించే గుణం ఉందంటారు హైదరాబాద్కు చెందిన ‘ఆరుష్ స్టోన్ థెరపీ’ నిపుణురాలు సునీత. సూర్యుడి తొలి కిరణాల నుంచి స్టోర్ థెరపీకి ఆ పేరు వచ్చింది. సుమారు రెండువేల డిగ్రీల సెల్సియస్ వరకు ఈ రాళ్లను వేడిచేస్తారు. దీంతో, సూర్యుడి ఉదయ కిరణాలతో సమానమైన శక్తి వస్తుందట. వీటితో తయారు చేసిన పడక, చాప, బెల్ట్ వంటి సాధనాలతో ఆరుష్ స్టోన్ థెరపీ చేస్తారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మినహాయించి మిగతా సమస్యలకు ఈ స్టోన్ థెరపీ చక్కగా పనిచేస్తుందంటారు సునీత. ‘ఐదేండ్ల క్రితం నేనూ ఆరుష్ స్టోన్ థెరపీ తీసుకొన్నాను. చక్కటి పరిష్కారం లభించింది. దాంతో, థెరపీపై నమ్మకం కుదిరింది. అక్కడే మూడు నెలల కోర్సులో చేరాను. ఏడాదిపాటు అందులోనే పని చేశాను. తర్వాత, సొంతంగా క్లినిక్ ప్రారంభించాను. చిన్నచిన్న సమస్యలకు కూడా హైరానా పడిపోయి పెద్దాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పన్లేదు. పూర్వీకులు సూచించిన విధానాలను ఆశ్రయించడం మేలు’ అంటున్నారు సునీత.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

