అచ్చు గుద్దినట్టు.. హలో బ్రదర్స్!
కోటలో రాముడు. పేటలో భీముడు. రాముడు శత్రువులతో కత్తి యుద్ధం చేస్తుంటే భీముడు నిద్రలోనే కర్ర తిప్పుతాడు. విలన్ల దాడిలో రాముడు గాయాలపాలైతే, భీముడు కూడా కుప్పకూలిపోతాడు. వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామానికి చెందిన కవలలు రామ్-లక్ష్మణ్ కథ కూడా ‘బ్లాక్ అండ్ వైట్' సినిమాలను తలపిస్తుంది
కోటలో రాముడు. పేటలో భీముడు. రాముడు శత్రువులతో కత్తి యుద్ధం చేస్తుంటే భీముడు నిద్రలోనే కర్ర తిప్పుతాడు. విలన్ల దాడిలో రాముడు గాయాలపాలైతే, భీముడు కూడా కుప్పకూలిపోతాడు. వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామానికి చెందిన కవలలు రామ్-లక్ష్మణ్ కథ కూడా ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాలను తలపిస్తుంది. ఒకరికి చలిజ్వరం వస్తే, మరొకరు రగ్గు కప్పుకోవాల్సిందే. ఒకరికి కడుపునొప్పి వస్తే మరొకరు గోళీ మింగాల్సిందే. పోలికలు కూడా ఒకేలా ఉంటాయి.
రామ్ లక్ష్మణ్‌లా ఉంటాడు. లక్ష్మణ్ రామ్లా ఉంటాడు.
ఐదు నిమిషాల తేడాతో పుట్టారు ఈ కవలలు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో రామలక్ష్మణులని పేరు పెట్టారు. పోలికలే కాదు, ఉద్వేగాలూ ఒక్కటే. ఒకరికి కోపమొస్తే, మరొకరు పళ్లు కొరుకుతారు. ఒకరికి ఆనందంగా అనిపిస్తే మరొకరు ఎగిరి గంతేస్తారు. ఈ కవలలకు మరో ప్రత్యేకతా ఉంది. ఒకరు అనారోగ్యం పాలైతే మరొకరు నీరసించిపోతారు. ఎందుకిలా జరుగుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని తున్కిఖల్సా రామలక్ష్మణుల స్వగ్రామం. తల్లిదండ్రుల పేర్లు రాజయ్య, లక్ష్మమ్మ. కలిసి పుట్టడమే కాదు, ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తారు. ఏ పనిచేసినా కలిసే చేస్తారు. బాల్యం నుంచీ చిన్నపాటి మనస్పర్ధలు కూడా రాలేదు. రామ్‌లక్ష్మణ్‌ల లగ్గాలు సైతం ఒకేసారి, ఒకే వేదిక మీద, దాదాపుగా ఒకే ముహూర్తానికి అయ్యాయి.

ఎన్నికల్లో మాత్రం..
రామ్‌లక్ష్మణ్ తున్కిఖల్సా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశారు. రెండో వార్డు మెంబర్‌గా రామ్, మూడో వార్డు మెంబర్‌గా లక్ష్మణ్ బరిలోకి దిగారు. రెండో వార్డు కౌంటింగ్‌లో రామ్‌కు, అతని ప్రత్యర్థికి సమానంగా ఓట్లు పడ్డాయి. దీంతో అధికారులు టాస్ వేశారు. రామ్‌ను దురదృష్టం వరించింది. మూడో వార్డులో మాత్రం లక్ష్మణ్‌ను విజయం వరించింది. ఉప సర్పంచి పీఠం దక్కింది. ఇద్దరూ వ్యవసాయం చేస్తూనే.. ఆర్ఎంపీ వైద్యులుగా సేవలు అందిస్తున్నారు.
- రంగు శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

