పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ.. అందరూ ఇష్టంగా తినేవాటిలో చాక్లెట్లు ముందుంటాయి. వీటిలో ముఖ్యంగా డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ రెండు రకాలు. మరి, ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
మిల్క్ చాక్లెట్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కోకో శాతం 70 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా అధికమే. అనారోగ్యకరమైన చక్కెరలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇక డార్క్ చాక్లెట్లో ఆరోగ్యానికి మేలుచేసే ఫ్లేవనాయిడ్లు, యాంటి ఆక్సిడెంట్లూ ఉంటాయి.
అయితే, డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైనదే అయినా, ఇందులో కేలరీలు ఎక్కువ. కాబట్టి రోజుకు 30-60 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. డార్క్ చాక్లెట్ కొనే ముందు.. కోకో కనీసం 70% ఉందో లేదో చూసుకోవాలి. తక్కువగా ఉంటే.. అందులో చక్కెర శాతం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.