OTT | అడుగడుగున గండం.. టియర్స్ ఆఫ్ ద సన్
OTT | బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడో విడుదలైన సినిమాలు ఓటీటీలో మళ్లీ ప్రత్యక్షం కావడం ఇటీవల రివాజుగా మారింది. అలా ఓటీటీ ఎక్కిన చిత్రమే ‘టియర్స్ ఆఫ్ ద సన్'. 2003లో వెండితెరపై విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వసూళ్ల పరంగా పెద్దగా విజయం సాధించకపోయినా.. సినిమా సబ్జెక్ట్, టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
- నెట్ఫ్లిక్స్ తారాగణం: బ్రూస్ విల్లీస్, మోనికా బెలూచి, జానీ మెస్నెర్ తదితరులు
- దర్శకత్వం: ఆంటోనీ ఫక్వా
OTT | బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడో విడుదలైన సినిమాలు ఓటీటీలో మళ్లీ ప్రత్యక్షం కావడం ఇటీవల రివాజుగా మారింది. అలా ఓటీటీ ఎక్కిన చిత్రమే ‘టియర్స్ ఆఫ్ ద సన్’. 2003లో వెండితెరపై విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వసూళ్ల పరంగా పెద్దగా విజయం సాధించకపోయినా.. సినిమా సబ్జెక్ట్, టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రం రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. కథలోకి వెళ్తే… నైజీరియాలో భీకర అంతర్యుద్దం జరుగుతుంటుంది. జాతి, మత విద్వేషాలు పెచ్చరిల్లడంతో దేశమంతా హత్యాకాండ కొనసాగుతుంది. అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలటరీ దళాలు ఆ దేశ అధ్యక్షుణ్ని కూడా హతమార్చేస్తాయి. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.
నైజీరియాలో ఉన్న విదేశీయులపై కూడా సైన్యం దాడి చేస్తుంటుంది. అమెరికాకు చెందిన డాక్టర్ కెండ్రిక్స్ (మోనికా బెలూచి) నైజీరియాలో పేదలకు వైద్య సేవలు అందిస్తుంటుంది. దేశంలో అరాచకం తలెత్తిన నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి తప్పించాలని అమెరికన్ ఎంబసీ నుంచి ఆదేశాలు వస్తాయి. లెఫ్టినెంట్ వాటర్ (బ్రూస్ విల్లీస్) ఆధ్వర్యంలోని బృందం రహస్యంగా నైజీరియాలో దిగుతుంది. కెండ్రిక్స్ నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి చేరుకుంటుంది. ఆమెను తమ వెంట రావాల్సిందిగా వాటర్ కోరుతాడు. అక్కడున్న బాధితులను వదిలిపెట్టి తాను రాలేనంటుందామె. వాళ్లను కూడా కాపాడతామని మాటిస్తే గానీ.. కదలనంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లందరినీ కాపాడతానని వాటర్ మాటిస్తాడు. అందరినీ తీసుకొని అడవి దారిలో కామెరూన్ సరిహద్దులకు చేరుకోవాలని నిర్ణయిస్తాడు. ఈ దారిలో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, నైజీరియా సైనికుల నుంచి ఎలా తప్పించుకున్నారన్నది మిగిలిన కథ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

