క్లెన్సింగ్ ధ్యానంలా..
ఇందుకోసం ముందుగా మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. డిమ్ లైట్లు ఉంచుకొని, గోరు వెచ్చటి నీటిని సిద్ధం చేసుకోవాలి. లేదా ట్యాప్‌లో నునువెచ్చటి నీరు వచ్చేలా చూసుకోవాలి.
చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సింగ్ ప్రక్రియను కూడా మైండ్ఫుల్నెస్కు కనెక్ట్ చేస్తున్నారు సౌందర్య నిపుణులు. ఏ పనినైనా ధ్యాసతో చేయడం వల్ల అది ధ్యానంగా మారుతుందన్న విషయం తెలిసిందే. అలాగే స్కిన్కేర్లోనూ దీన్ని చొప్పించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చట.
అవకాశం ఉంటే గదిలో సువాసనలు వెదజల్లే సెంటెడ్ క్యాండిల్‌ను వెలిగించినా సరే. ఇక క్లెన్సింగ్ కోసం మన చర్మరకాన్ని బట్టి హాని చేయని క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మనం చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామన్న భావన మనసుకు ఏర్పడుతుంది. మెదడులోని గందరగోళాలను పక్కన పెట్టి మెల్లగా శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాలి. తర్వాత క్లెన్సర్‌ను అరచేతిలో వేసుకుని ముఖం మీద వలయాకారాల్లో మృదువుగా ఒక నిమిషం పాటు మర్దనా చేస్తూ నురగ వచ్చేలా చేయాలి. శుభ్రమైన నీటితో కడిగేస్తూ ఆ నురగ, చర్మంలో వచ్చిన మార్పులను చేతితోనే కాకుండా మనసుతోనూ గమనించాలి. మురికి వదిలిపోయి చర్మం శుభ్రంగా మారే ఈ క్లెన్సింగ్ ప్రక్రియను ఆస్వాదించాలి. స్పర్శ, శబ్దం, వాసన… ఇలా అన్నింటినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుందట. అంతేకాదు, ఇలా చేయడం ద్వారా చర్మరక్షణ పట్ల మనకు ఆసక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నదీ కొత్త ట్రెండ్!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

