ఆకట్టుకునేలా కథలు రాయగలరా.. అయితే 25 వేలు పొందే లక్కీ ఛాన్స్ మీకోసమే!!
Script a Hit | మీరు వర్ధమాన రచయితా? వైవిధ్యమైన ఇతివృత్తంతో రచనలు చేస్తారా? ట్విస్టులతో పాఠకులను కట్టిపడేస్తారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇన్నాళ్లూ ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా’ అంటూ ప్రచురణకర్తల చుట్టూ తిరిగింది చాలు. ‘స్క్రిప్ట్ఎహిట్’ వెబ్‌సైట్‌తో మీ కలను నెరవేర్చుకోండి.

బెంగళూరుకు చెందిన జైశంకర్ కృష్ణమూర్తి కొత్త రచయిత. అనుకున్న అంశాన్ని రక్తి కట్టేలా రాయాలన్నది ఆయన కోరిక. అందుకు తన శక్తి సరిపోదేమో అని వెనుకంజ వేసేవారు.
అప్పటికే కాల్పనిక కథలు, సినిమా, ఓటీటీ స్క్రిప్ట్‌లపై పట్టున్న తన భార్య కృష్ణ ఉదయ శంకర్ సహకారంతో ఇటీవల ‘ఫార్సైడ్’ అనే నవలకు పుస్తక రూపం ఇచ్చారు. ఆ అనుభవం తర్వాత, తనలాగే మథనపడేవారికి సరైన వేదికను ఇవ్వాలనుకున్నారు కృష్ణమూర్తి దంపతులు.
ఆలస్యం చేయకుండా ‘స్క్రిప్ట్ఎహిట్’ (scriptahit.com) వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ ఆలోచనను కాగితంపై పెట్టి, ఆ కథను వీరికి పంపాలి. నిర్వాహకులకు నచ్చితే వెంటనే మీఅకౌంట్లో రూ.25 వేల పారితోషికం జమచేస్తారు. ఒకవేళ మీరు ఆ కథలను పుస్తక రూపంలోకి తీసుకొస్తే ఖర్చులన్నీ పబ్లిషర్స్ భరించేలా, వచ్చే లాభాల్లో మీకూ రాయల్టీ అందేలా ఏర్పాట్లు చేస్తారు. సినిమాగా తీయాలనుకుంటే నిర్మాతనూ వెతికిపెడతారు. లాభాల్లో 30 శాతం వాటా కూడా అందిస్తారు. ఇప్పటికే scriptahit.com వెబ్‌సైట్‌కు దేశ, విదేశాల నుంచి కథల ప్రవాహం మొదలైంది.
Read More :
“We Hub | మహిళల వ్యాపార ఆలోచనలకు రూపమిస్తూ.. స్టార్టప్‌లకు ప్రాణం పోస్తున్న వీహబ్”
ఏడు పదుల వయసులో పెయింటింగ్ నేర్చుకుని అవార్డులు అందుకుంటున్న బామ్మ”
మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తున్నరు !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- writers
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

