ఓటీటీ హిట్
ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. వినియోగదారులకు తెలియకుండానే వారి మాటలు వింటూ, రోజువారీ జీవితాన్ని రికార్డు చేస్తున్నాయి.
- సైబర్ టెర్రర్- పేట్రియాట్
- జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది.
- తారాగణం: మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, నయనతార, కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్, రేవతి తదితరులు
- దర్శకత్వం: మహేష్ నారాయణన్
ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. వినియోగదారులకు తెలియకుండానే వారి మాటలు వింటూ, రోజువారీ జీవితాన్ని రికార్డు చేస్తున్నాయి. ఇలాంటి డేటా చోరీ వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టే చిత్రం.. పేట్రియాట్. మలయాళ దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్‌తోపాటు ఫహద్ ఫాజిల్, నయనతార లాంటి అగ్రనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. గత మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. తాజాగా ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది.
కథలోకి వెళ్తే, డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి).. డీఆర్డబ్ల్యూ అనే డిఫెన్స్ సంస్థలో సైంటిస్ట్‌గా పనిచేస్తుంటాడు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల పనితీరుపై అవగాహన ఎక్కువ. డిఫెన్స్ మినిస్టర్ జేపీ సుందరం (రాజీవ్ మీనన్), అతని కొడుకు శక్తి (ఫహద్ ఫాజిల్) కలిసి.. ఓ సీక్రెట్ యాప్ ద్వారా ప్రజల వ్యక్తగత డేటాను చోరీ చేస్తుంటారు.
వీరి అక్రమాలను డేనియల్ కనిపెడతాడు. దాంతో, అతణ్ని దేశద్రోహిగా చిత్రిస్తారు. ఈ క్రమంలో డేనియల్ దేశం విడిచి పారిపోతాడు. లండన్ నుంచి ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతూ.. శక్తి చేసే మోసాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో డేనియల్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అతని భార్య లతిక (నయన తార).. అతనికి ఎందుకు దూరంగా ఉంటున్నది? కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్‌లాల్) ఎవరు? శక్తి గ్రూప్‌ను చట్టానికి పట్టించాలనుకున్న డేనియల్ లక్ష్యం నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

