గుండెనొప్పా? పానిక్ అటాకా?
పానిక్ అటాక్ (తీవ్రమైన భయాందోళన) సమయంలోనూ ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే కొందరు గుండెపోటేమోనని ఆందోళన చెందుతుంటారు. పానిక్ అటాక్, గుండెపోటు ఒకేలా అనిపించినప్పటికీ.. ఇవి రెండూ భిన్నమైన సమస్యలు.
పానిక్ అటాక్ (తీవ్రమైన భయాందోళన) సమయంలోనూ ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే కొందరు గుండెపోటేమోనని ఆందోళన చెందుతుంటారు. పానిక్ అటాక్, గుండెపోటు ఒకేలా అనిపించినప్పటికీ.. ఇవి రెండూ భిన్నమైన సమస్యలు.
గుండెపోటు అంటే..
గుండె కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా బ్లాక్స్ ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున ఏదో బరువైన వస్తువు పెట్టి నొకినట్టు, పిండినట్టు ఉంటుంది. ఈ నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా ఎడమ చెయ్యి, భుజం, మెడ, దవడ, వీపు భాగాలకు పాకుతుంది. దీంతో శరీరమంతా చల్లటి చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల కంటే ఎకువ సమయం ఉంటాయి. చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ పరిస్థితి మరింత విషమిస్తుంది.
పానిక్ అటాక్ అంటే..
ఇది అకస్మాత్తుగా శరీరంలో తీవ్రమైన ఆందోళన లేదా భయం వల్ల కలిగే మానసిక/శారీరక స్పందన. ఇందులో వచ్చే నొప్పి సాధారణంగా సూదితో గుచ్చినట్టు ఉంటుంది. ఇది శరీరమంతా వ్యాపించకుండా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు, వేగంగా శ్వాస తీసుకోవడం, చేతులు లేదా నోటి చుట్టూ తిమ్మిర్లు ఎకినట్టు ఉండటం, కళ్లు తిరగడం దీని లక్షణాలు. పానిక్ అటాక్ లక్షణాలు ప్రారంభమైన 10 నిమిషాల్లో తీవ్ర స్థాయికి చేరుకుని, 20 నుంచి 30 నిమిషాల్లో క్రమంగా తగ్గిపోతాయి. ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటే.. గుండె వేగం తగ్గుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

