పాలక్ పనీర్ బుర్జీ
స్టవ్‌మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి. తర్వాత చిన్నగా తరిగిన క్యాప్సికమ్, టమాట ముక్కలు, పాలకూర తురుము వేసి మగ్గించాలి
కావలసిన పదార్థాలు
పాలకూర తురుము: ఒక కప్పు, పనీర్ తురుము: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, బిర్యానీ ఆకు: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, టమాట: ఒకటి, అల్లం, వెల్లుల్లి ముద్ద: ఒక టీస్పూన్, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర: అర టీస్పూన్, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు: అర టీస్పూన్ చొప్పున, ఫ్రెష్ క్రీం: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి. తర్వాత చిన్నగా తరిగిన క్యాప్సికమ్, టమాట ముక్కలు, పాలకూర తురుము వేసి మగ్గించాలి. ఫ్రెష్ క్రీం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత పనీర్ తురుము వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకొంటే నోరూరించే పాలక్ పనీర్ బుర్జీ సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Palak paneer
- paneer
- recipe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

