స్వీట్ అడిగితే ట్విస్ట్ ఇచ్చారు!
సోషల్మీడియాలో సరదాకోసం చేసే కొన్ని వ్యాఖ్యలు తమ కొంపముంచుతాయని కొన్ని సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. అది తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
సోషల్మీడియాలో సరదాకోసం చేసే కొన్ని వ్యాఖ్యలు తమ కొంపముంచుతాయని కొన్ని సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. అది తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తమిళనాడులోని మదురైకి చెందిన ఇన్ఫ్లూయెన్సర్ వీరమణికి కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. వీరమణికి సామాజిక మధ్యమాల్లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన క్రేజ్ ఎంతుందో పరీక్షించుకుందామని ఓ సారి తనకు డబ్బులు పంపమని క్యూఆర్ కోడ్ పెట్టాడు.
అది బాగా గిట్టుబాటు కావడంతో ఈసారీ అదే ఆశతో కొత్త పథకానికి తెరతీశాడు. ఈ దీపావళికి తనకు స్వీట్లు పంపాలని కోరుతూ తన ఇంటి అడ్రెస్ను పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు తనకు కండ్లు చెదిరే షాకిచ్చారు. స్వీట్లకు బదులు.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్లాంటి బహుమతులను పంపారు. ఆ బహుమతులు వచ్చిన ఆనందం వీరమణి ముఖంలో మరుక్షణం ఆవిరైంది. ఎందుకంటే.. అవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ కావడంతో వీరమణి అవాక్కయ్యాడు. అయినా ఈ-కామర్స్ నుంచి వరుసగా ఆగకుండా ఆర్డర్లు వస్తుండటంతో తట్టుకోలేక ‘నేను ఇంటిని ఖాళీ చేసి శ్మశానంలో ఉంటున్నాను.
దయచేసి ఇకనైనా ఆపండి ప్లీజ్’ అంటూ వేడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియాలన్నీ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అభిమానులకు ప్రేమ ఎక్కువైతే ఏం అవుతుందో తెలిసిందా! అంటూ కొంతమంది కొంటె కొటేషన్లు పెడుతుండగా, మరికొంతమంది అయ్యోపాపం అంటూ ఎమోజీలు గుమ్మరిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

