అనగనగా.. ఓ రాజకుమారి!

ప్రతి అమ్మాయీ బయటికెళ్లి నచ్చిన పని చేయాలనే అనుకుంటుంది. తనదైన రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. అయితే, ఆ తపనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం. అలా, స్వశక్తితోపాటు కన్నవారి ప్రోత్సాహంతో మంచి ర్యాపర్‌గా పేరు సంపాదించుకుంది 35 ఏండ్ల ఇండో అమెరికన్ ర్యాపర్.. రాజకుమారి ఉరఫ్ శ్వేత ఎల్లాప్రగడ రావు.
రాజకుమారి తల్లిదండ్రులు యాభై ఏండ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె అక్కడే పుట్టి పెరిగింది. కన్నవాళ్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపకంలో ఓ భాగం చేశారు. ఏడాదికోసారి కచ్చితంగా ఇండియాకు వచ్చేది రాజకుమారి. హైదరాబాద్‌లోని నానమ్మ దగ్గర కొన్ని రోజులు గడిపేది. ఐదేండ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో శిక్షణ తీసుకుంది. రవీంద్రభారతిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆ అందం, అభినయం, హుందాతనం చూసి అందరూ, శ్వేతా ఎల్లాప్రగడను ‘రాజకుమారి’ అని పిలువడం మొదలుపెట్టారు. అలా, ఆమె స్వభావమే పేరుగా స్థిరపడింది. తన ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుతో రాజకుమారి బెంగళూరులో ఒక హాస్పిటల్ నిర్మించింది. దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. సాంస్కృతిక రంగంలో ప్రతిభకుగానూ తమిళనాడు గవర్నర్ చేతులమీదుగా ‘కోహినూర్’ అవార్డును అందుకొంది. తర్వాత హిప్ పాప్వైపు అడుగేసింది. సంగీతంలో నోబెల్‌తో సమానమైన గ్రామీ అవార్డుకు నామినేషన్ ఒక సెన్సేషన్. ఆ తర్వాత అన్నీ ప్రకంపనలే. ర్యాపర్‌గా, సాంగ్ రైటర్‌గా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంది. సెంచరీస్, చేంజ్ యువర్ లైఫ్, డోంట్ యూ రన్, బ్రేవ్ ఇనఫ్, సెట్ మీ ఫ్రీ.. వంటి ఎన్నో అద్భుతమైన పాటలకు పని చేసింది. అనేక ఆల్బమ్స్‌కు సాహిత్యం సమకూర్చింది.
రెహమాన్ సారథ్యంలో..
రాజకుమారికి చిన్నప్పటినుంచీ ఏఆర్ రెహమాన్ సంగీతమంటే ఇష్టం. ఎప్పటికైనా ఆయనను కలవాలని, తన ప్రతిభను చూపాలని కలలు గన్నది. ఆ స్వప్నం 2015లో నిజమైంది. చాలా సినిమాల్లో రెహమాన్ సంగీతానికి పాటలు పాడింది. రెహమాన్ కంపోజ్ చేసిన ‘దిల్ బేచారా’ సినిమాలో రాజకుమారి పాడిన పాటకు మంచిపేరు వచ్చింది. రాజకుమారికి మాధురీ దీక్షిత్ అంటే అభిమానం. చిన్నప్పుడు ‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమా చూసి ఫిదా అయింది. ఇంట్లో రోజూ ఆ సినిమా క్యాసెట్ వేసుకుని చూసేది. “నేను మాట్లాడే విధానంలో మాధురీ దీక్షిత్ హావభావాలు తొంగిచూస్తాయి. పూర్తిగా తనలా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. మా భరతనాట్యం టీచర్ చాలా స్ట్రిక్ట్. ఆమె లేనప్పుడు, మా నాన్న నన్ను మాధురి డ్యాన్స్ చేయమని అడిగేవారు. మా అమ్మ నన్ను ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా చూడమన్నప్పుడు, అందులో మాధురి లేదనీ, సినిమా చూడననీ మారాం చేశాను. సినిమా చూశాక షారుక్‌ఖాన్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యా” అంటుంది రాజకుమారి. తర్వాత, ఆమెకు మాధురీ దీక్షిత్ మంచి స్నేహితురాలు అయింది. రాజకుమారి ముంబైలో ఉండటానికి తల్లిదండ్రులను ఒప్పించింది తనే. లాక్‌డౌన్‌కి ముందువరకు రాజకుమారి మూడేండ్లు ముంబైలోనే ఉంది. నానమ్మ జ్ఞాపకార్థం తెలుగులోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నది. ‘పీస్’ అనే తన పాటకు హిందీ వెర్షన్ ‘శాంతి’ చాలామందికి కొత్త శక్తిని, పాజిటివ్ వైబ్స్‌ని అందించింది. ‘సంగీతం అంతిమ లక్ష్యం అదే కదా’ అంటుందామె.
బొట్టుతో ఐడెంటిటీ
రాజకుమారి పాటల్లో సాహిత్యం బోల్డ్‌గా ఉంటుంది. ఆమె మేకప్, డ్రెస్సింగ్కూడా స్పెషలే. ఎవరేమనుకున్నా.. కంఫర్ట్ తనకు ముఖ్యమని చాలాసార్లు చెప్పింది కూడా. రాజకుమారికి జువెలరీ అంటే ఇష్టం. పాత తరం ఆభరణాల్లో చరిత్ర ఉంటుందని నమ్ముతుంది. అమ్మ, నానమ్మలనుంచి ఎన్నో నగలు సేకరించింది. అన్నిటికన్నా రాజకుమారి బొట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె తల్లికూడా చీరలనుంచి వెస్టర్న్ వేర్కి మారినా, బిందీని మాత్రం వదిలి పెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అమ్మాయిలు ఆమె ైస్టెల్‌ని ఫాలో అవుతూ. నుదుట బొట్టు, చెవులకు జుమ్కాలు పెట్టుకున్నారు. ఓ తెలుగమ్మాయి పాశ్చాత్య సంగీతాన్ని ఏలడం అంటే మాటలు కాదు. సాహో.. రాకుమారీ!
మార్పు రావాలి
“నా వరకు నేను కొంత రెవల్యూషన్ తెచ్చాననే అనుకుంటున్నా. నాలాగే ప్రతి అమ్మాయీ బోల్డ్‌గా ఉంటూ, నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి. ఆ సిస్టర్హుడ్ మనకు చాలా అవసరం. నేను ఇండియాకు వచ్చినప్పుడు, సీన్లో నాతోపాటు ఇంకొంతమంది అమ్మాయిలు ఉండాలని ఎప్పుడూ అడిగేదాన్ని. కానీ, టేబుల్‌కు ఒక సీటు మాత్రమే అమ్మాయిలకు కేటాయిస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించేవారు. వందలమంది మగవాళ్లు ఉన్నచోట మహిళలకు దక్కాల్సిన ప్రాధాన్యం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి. అయితే, ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తున్నది. పితృస్వామ్య వ్యవస్థలో మార్పు వస్తున్నట్టు అనిపిస్తున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

