ఇండియన్ ఇంతికి ఇటలీ మంగళసూత్రం

భారతీయ మహిళలకు ప్రత్యేక ఆభరణం మంగళ సూత్రం. కాలానుగుణంగా పుస్తెలతాడు కూడా ఫ్యాషన్ ఆభరణంగా మారింది. తాజాగా ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బల్గరీ మణిమయ ఖచిత మంగళ సూత్రాన్ని మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో ప్రియాంక చోప్రా జోనాస్‌ను తమ సంస్థ తమ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించిన వెంటనే ఈ ఆభరణాన్ని విపణిలో విక్రయానికి ఉంచింది. ‘బల్గరీ నెక్లెస్’గా పిలిచే ఈ సూత్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. పురాతన రోమన్ నాణేలపై ఉన్న రాతల నమూనాలో సంస్థ పేరును మంగళ సూత్రాలపై ముద్రించారు. గోమేధికాలు, మధ్యలో వజ్రాలను పొదిగిన ఈ ఆభరణం ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ప్రధాన ఆకర్షణ. ఈ నగను ‘సౌందర్యానికి సమకాలీన వ్యాఖ్య’గా బల్గరీ నిర్వచించింది. సంస్థ వెబ్సైట్ ప్రకారం మంగళ సూత్రం ధర రూ. 3,49,000. వోగ్ ఇండియా తాజా సంచిక ముఖ చిత్రంపై ప్రియాంక చోప్రా ఇదే మంగళ సూత్రాన్ని ధరించడం విశేషం.

Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

