రాగి హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు, ఉప్మా రవ్వ: పావు కప్పు, బెల్లం: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ (కాజూ, బాదం, పిస్తా): పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి, వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యివేసి రాగి పిండి, ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేంతవరకూ సన్నని మంటపై వేయించాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని రెండు కప్పుల నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. కరిగిన బెల్లాన్ని రాగిపిండి మిశ్రమంలో పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుతూ.. కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ.. దగ్గరపడేవరకు బాగా ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించుకుంటే సరి. వేడివేడి రాగి హల్వా సిద్ధం. కావాలంటే నెయ్యి రాసిన పళ్లెంలో పరిచి, చల్లారాక
ముక్కలుగానూ కోసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

