ఫ్రిజ్ లేకపోయినా తాజాగా
వారానికి ఒకసారి సంతకు వెళ్లి కూరగాయలు కొనుక్కొస్తాం. కానీ రెండు రోజులు గడవకముందే ఆకుకూరలు వాడిపోవడం, కూరగాయలు తేమ కోల్పోవడం, ఫ్రిజ్‌లో పెట్టినా త్వరగా పాడవడం చాలామంది ఇళ్లలో కనిపించే సమస్య.
వారానికి ఒకసారి సంతకు వెళ్లి కూరగాయలు కొనుక్కొస్తాం. కానీ రెండు రోజులు గడవకముందే ఆకుకూరలు వాడిపోవడం, కూరగాయలు తేమ కోల్పోవడం, ఫ్రిజ్‌లో పెట్టినా త్వరగా పాడవడం చాలామంది ఇళ్లలో కనిపించే సమస్య. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగా ఇప్పుడు వంటగదుల్లోకి అడుగుపెడుతున్నాయి ‘వెజిటబుల్ ప్రిజర్వేషన్ బ్యాగ్’లు. కూరగాయల తాజాదనాన్ని కాపాడుతూ ఆహార వృథాను తగ్గించడంలో ఇవి మనకు సాయపడతాయి.
మనం వాడే సాధారణ ప్లాస్టిక్ కవర్లు కూరగాయలకు ఊపిరాడకుండా చేస్తాయి. వాటి నుండి వచ్చే తేమ ఆ కవర్ల లోపలే పేరుకుపోయి, బ్యాక్టీరియా చేరి త్వరగా కుళ్లిపోతాయి. కానీ, వెజిటబుల్ ప్రిజర్వేషన్ బ్యాగులు అలా కాదు. ఇవి ప్రకృతి సిద్ధమైన కాటన్, మస్లిన్ వస్ర్తాలతో లేదా ప్రత్యేకమైన ఫుడ్‌గ్రేడ్ మెష్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి కూరగాయలకు సరిపడా గాలి ఆడేలా చేస్తూ, వాటి ఆయుష్షును పెంచుతాయి.
ఈ బ్యాగుల ప్రత్యేకత ఏంటంటే, ఇవి కూరగాయలలోని తేమను సమతుల్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు, బెండకాయలు, క్యారెట్లలాంటి వాటిని కాటన్ బ్యాగులలో ఉంచి, కాస్త నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో పెడితే.. వారం రోజులైనా ఇప్పుడే తోట నుంచి కోసుకొచ్చినట్లు తాజాగా ఉంటాయి. అలాగే, ఇవి కూరగాయలు విడుదల చేసే ‘ఇథిలిన్’ గ్యాస్‌ను బయటకు పంపేయడం వల్ల త్వరగా ముదిరిపోవు. ఉతికి, శుభ్రం చేసి ఎన్నిసార్లు అయినా తిరిగి వాడుకో గలిగిన ఈ బ్యాగులు పర్యావరణ హితకారులు కూడా!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

