గుడ్డులో పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?… తెల్ల సోన తింటే ఏమౌతుంది?
కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎకువ. తెల్లసొన ఒక ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్. దీనికి శరీరంలో మంటను కలిగించే స్వభావం ఉంటుంది. దీన్ని పచ్చసొనతో కలిపి తిన్నప్పుడు మాత్రమే అది సమతుల్యమైన, సంపూర్ణ ఆహారంగా మారుతుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందనే కారణంతో దాన్ని అందరూ విలన్గా చూస్తారు.
గుడ్డులో పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అది గుండెకు ప్రమాదమని భావించి చాలామంది దాన్ని పకన పెడతారు. మరీ ముఖ్యంగా జిమ్కు వెళ్లేవారు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తిని పచ్చసొనను పారేస్తుంటారు. కానీ పచ్చసొనతో కలిపి తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎకువ. తెల్లసొన ఒక ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్. దీనికి శరీరంలో మంటను కలిగించే స్వభావం ఉంటుంది. దీన్ని పచ్చసొనతో కలిపి తిన్నప్పుడు మాత్రమే అది సమతుల్యమైన, సంపూర్ణ ఆహారంగా మారుతుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందనే కారణంతో దాన్ని అందరూ విలన్గా చూస్తారు. కానీ, వాస్తవానికి గుడ్డులోని మెజారిటీ పోషకాలు అందులోనే ఉంటాయి. తెల్లసొనతో పోలిస్తే పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుషలంగా లభిస్తాయి. మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్లో దాదాపు 85 శాతం మన కాలేయమే సొంతంగా తయారు చేస్తుంది. కేవలం 15 శాతం మాత్రమే మనం తినే ఆహారం ద్వారా అందుతుంది.
శరీరం తనంతట తానుగా తయారు చేసుకునేది ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరం కాదు. కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కొలెస్ట్రాల్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చసొనను విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బరువు తగ్గాలనుకున్నా, మీ కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా గుడ్డును పచ్చసొనతో కలిపి పూర్తిగా తినడమే శ్రేయసరం. మారెట్లో దొరికే కృత్రిమ ప్రొటీన్ల కంటే ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి అయ్యే గుడ్డు ద్వారా లభించే పచ్చసొన ఎంతో మేలు చేస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

