జీవనశైలి వ్యాధులుగా క్యాన్సర్లు
ఒకప్పుడు కారణం లేకుండా వచ్చే క్యాన్సర్ వ్యాధులు.. ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. అంటే మానవ తప్పిదాల వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఒకప్పుడు కారణం లేకుండా వచ్చే క్యాన్సర్ వ్యాధులు.. ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. అంటే మానవ తప్పిదాల వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, హోటల్ భోజనం, జంక్ ఫుడ్ వంటి వాటి వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. బయటి ఫుడ్లో ఎక్కువగా హానికరమైన రసాయన రంగులు, వాడిన నూనెలనే మళ్లీ మళ్లీ వాడటం వంటి తప్పిదాలు కూడా క్యాన్సర్లకు దారితీస్తాయి. వీటికి తోడు వృత్తిపరమైన కొన్ని అంశాలు కూడా క్యాన్సర్లకు అవకాశం కల్పిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురవడం, నిద్రలేమి, నైట్ డ్యూటీలు, ఏసీ గదుల్లో అధిక సమయం గడపటం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం.. పురుషులలో క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణమవుతున్నట్లు చెప్పవచ్చు.
జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. మహిళలతో పోలిస్తే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ మినహా ఇతర అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులూ పురుషుల్లోనే ఎక్కువగా చూస్తాం. ఈ మధ్య
కాలంలో పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ కనిపిస్తుండటం కలవరపెడుతుంది. వ్యాధులపై అవగాహన పెరుగుతున్నా, క్యాన్సర్లను ముందుగానే తెలుసుకునే స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ రోగాలకు అడ్డుకట్ట వేయలేక, రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం.. 2030నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య ఇతర క్యాన్సర్ల కంటే అధికంగా ఉండవచ్చని అంచనా.
ఇవే ప్రధాన కారకాలు
పురుషుల్లో క్యాన్సర్ వ్యాధులు రావడానికి ప్రధాన కారకాలు సిగరెట్, బీడీ, పాన్మసాల, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి. వీటివల్ల ఎక్కువగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ రోగుల్లో మనదేశం మొదటిస్థానంలో ఉండటం దురదృష్టకరం. ప్రతి సంవత్సరం 80వేల మంది వరకు నోటి క్యాన్సర్ బారినపడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోల్కతాలో ప్రతి లక్షమందిలో 20మంది, వాయు కాలుష్యం అధికంగా ఉన్న ఢిల్లీలో ప్రతి లక్షమందిలో 15 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్కు బలవుతున్నారు.
పురుషులను వేధిస్తున్న క్యాన్సర్లు
- ఓరల్ (నోటి క్యాన్సర్లు)
- అన్నవాహిక క్యాన్సర్
- ఊపిరితిత్తుల క్యాన్సర్
- ఉదరం క్యాన్సర్
- కోలన్ క్యాన్సర్
వీరికి రిస్క్ ఎక్కువ
దురలవాట్లు ఉన్నవారితో పాటు ఆస్బెస్టాస్ కంపెనీలలో పనిచేసేవారు, అల్యుమినియం ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాల్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియం ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, గామా రేడియేషన్ అధికంగా ఉన్న ప్రదేశాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అధికంగా ఎండలో తిరిగేవారు, ఎండ అస్సలు తగలకుండా ఏసీ గదులకే పరిమితమయ్యేవారు, అధికంగా నైట్ డ్యూటీలు చేసేవారు, పెస్టిసైడ్స్, కెమికల్స్ పరిశ్రమల్లో ఎక్కువగా పురుషులే కావడం వల్ల వారికే క్యాన్సర్ ముప్పు ఎక్కువ.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
- గొంతు నొప్పి, ఘన పదార్థాలు తీసుకోలేకపోవడం.
- ఆకలి, బరువు తగ్గడం.
- మూత్రం ఆగిఆగి రావడం, మూత్రంలో రక్తం కనిపించడం.
- దీర్ఘకాలం వేధించే దగ్గు, దగ్గుతో పాటు రక్తం పడటం.
- మల విసర్జనలో రక్తస్రావం.
- అజీర్తి.
- నోటిలో ఏర్పడిన పుండ్లు మానకుండా ఉండటం.
- ఎముకల నొప్పులు.
నిర్ధారణ పరీక్షలు :
- పీఎస్ఏ
- డీఆర్ఏ
- సీటీ-స్కాన్
- ఎంఆర్ఐ
- అల్ట్రాసౌండ్
- బోన్ స్కాన్.
-డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

