మనిషికి సమాజంలో దేనినిబట్టి విలువ ఇవ్వాలి?

ధర్మశాస్ర్తాల ప్రకారం మనిషికి సమాజంలో దేనినిబట్టి విలువ ఇవ్వాలి? ఎలాంటి వారికి విలువ ఉండదు?
డి.జి.శ్రీనివాసశర్మ, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్
కోపము నుబ్బును గర్వము,
నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,
కాపురుష గుణంబులండ్రు కౌరవనాథా॥
(మహాభారతం, ఉద్యోగపర్వం: 2-32)
ధర్మశాస్ర్తాలకు నిఘంటువు అయిన ‘మహాభారతం’లో ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పిన మాటలివి. ‘ఊరికే గొప్పలు చెప్పుకొంటూ బతకడం, అయిన దానికీ- కాని దానికీ కోపంతో రెచ్చిపోవడం, ఎంత సంపద ఉన్నా తృప్తి అనేదే లేకుండా గడపడం, పనీ పాటా లేకుండా తిరుగుతుండటం, పొగరుతో ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తించడం వంటి అవలక్షణాలు ఉన్న దుర్మార్గులకు సమాజంలోనూ ఎన్నటికీ విలువ ఉండదు. వాళ్ళ దుడుకుచేష్టలకు ఎవరైనా భయపడినట్టు కనిపించినా అది అప్పటికి మాత్రమే’. అలాంటివాళ్లకు కాలమే గుణపాఠం చెపుతుంది.
మంచి ఆలోచనలు ఉండే ఉత్తములకు మాట్లాడే తీరు, మాటలూ చేతలుకూడా ఆదర్శవంతంగా, గొప్పగానే ఉంటాయి. అలాంటివారే ఉత్తములు. వాళ్లకే సంఘంలో విలువ ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. ‘ఎప్పుడూ ఎవరినీ నొప్పించకుండా, స్వపర భేదాలకు, సుఖదుఃఖాలకు తావివ్వకుండా మెలగుతూ ఉండేవాళ్తే ఉత్తములని’ మన ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. ‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం’ (నరసింహ సుభాషితం: 53). ‘త్రికరణ శుధ్ధిగా ఉంటూ, మనసులో ఉన్నదాన్నే మాటలలో చెబుతూ, దానినే ఆచరించే ఉత్తములకే సమాజం విలువ ఇస్తుంది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

