పనస దొంగలెవరు?
ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న క్రమంలో విభిన్న కథాంశాలతో చిత్రాలు రూపొందు తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హారర్, కామెడీ ఇలా డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదలై హంగామా చేస్తున్నాయి. గంటా యాభై అయిదు నిమిషాల నిడివితో రూపొందిన ‘కఠల్' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది.
కఠల్ : ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ
నెట్‌ఫ్లిక్స్ : మే 19
తారాగణం : సానియా మల్హోత్రా, అనంత్ జోషి, విజయ్‌రాజ్, రాజ్‌పాల్ యాదవ్
దర్శకత్వం : యశోవర్ధన్ మిశ్రా
ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న క్రమంలో విభిన్న కథాంశాలతో చిత్రాలు రూపొందుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హారర్, కామెడీ ఇలా డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదలై హంగామా చేస్తున్నాయి. గంటా యాభై అయిదు నిమిషాల నిడివితో రూపొందిన ‘కఠల్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది. కథలోకి వెళ్తే మహిమ (సానియా మల్హోత్రా) మనసున్న ఎస్ఐ. ఒకరోజు స్థానిక ఎమ్మెల్యే పెరట్లోని పనస చెట్టుకు కాసిన రెండు కాయలు దొంగతనానికి గురవుతాయి. ఎమ్మెల్యే మున్నాలాల్ (విజయ్‌రాజ్) దొంగలను పట్టుకోవాల్సిందిగా ఎస్పీని డిమాండ్ చేస్తాడు.
ఆ కేసును మహిమకు అప్పగిస్తాడు ఎస్పీ. నేర పరిశోధనలో భాగంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఆమెకు అక్కడ వింత పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలన్నీ హాస్యభరితంగా సాగుతాయి. పనస కాయలు పోయినంత మాత్రాన ఎమ్మెల్యే ఎందుకు అంతగా కంగారు పడతాడు? ఇంతకీ వాటిని దొంగతనం చేసిందెవరు? అసలు నేరస్తులు పట్టుబడ్డారా లేదా అన్నది మిగతా కథ. ఎస్ఐ పాత్ర పోషించిన సానియా తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఎమ్మెల్యేగా నటించిన విజయ్‌రాజ్, సీనియర్ రిపోర్టర్‌గా కనిపించిన రాజ్‌పాల్ యాదవ్ నటన నవ్విస్తుంది!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

