Kriti Sanon | తెలివైన పెట్టుబడి.. భూములు కొంటూ స్థిరాస్తులు పెంచుకుంటున్న సినీతారలు
సినీతారల తళుకులు కెరీర్ పీక్‌లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు.
Kriti Sanon | సినీతారల తళుకులు కెరీర్ పీక్‌లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఎంత పెట్టుబడి పెడుతున్నామనే దానికంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామన్నదే ముఖ్యం.
‘భూమిపై పెట్టుబడి ఎప్పటికైనా లాభదాయకమే’ అనేది చాలామంది ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. అదే బాటలో పయనిస్తున్నారు సినీతారలు. బాలీవుడ్, టాలీవుడ్ తేడాలేకుండా చాలామంది నటీనటులు భూములు కొనుగోలు చేస్తూ స్థిరాస్తులను పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ భామ కృతీ సనన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. సౌత్ ముంబయిలోనే ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఆలీబాగ్ టౌన్లో 2,000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
‘అందమైన డెవలప్మెంట్ అయిన సోల్ డే ఆలీబాగ్‌లోని ద హౌజ్ ఆఫ్ అభినందన్ లోధాలో నేను కూడా ఒక గర్వమైన, సంతోషకరమైన ల్యాండ్ ఓనర్ అయ్యాను. భూమి కొనడం అనేది చాలా పెద్ద నిర్ణయం. నేను గత కొన్నాళ్లుగా ఆలీబాగ్‌లో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. ఇటీవల బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇదే టౌన్లో 10,000 చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేయడం విశేషం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

