తాజ్ మహల్ చూడాలని ఉన్నా.. అంతదూరం వెళ్లలేకపోతున్నారా? ఏం ఫర్వాలేదు. అదితీరావ్ హైదరీని చూస్తే సరిపోతుంది. అమ్మడు ప్రాణమున్న పాలరాతి బొమ్మే! ‘తాజ్.. డివైడెడ్ బై బ్లడ్’ వెబ్ సిరీస్లో తను మరింత తాజాగా కనిపిస్తుంది.
అదితికి ఫ్యాషన్ స్పృహ ఎక్కువే. డిజైనర్ రితూ కుమార్ ప్రాణంపోసిన.. జానెట్ ఎంబ్రాయిడరీ గౌనుతో ఓ షూట్లో పాల్గొంది తను. ఎమరాల్డ్, పోల్కీ నెక్లెస్ ఆ మిల్కీ బ్యూటీకి కొత్త అందం తెచ్చింది.