వర్ష బొల్లమ్మ .. ‘చూసీ చూడంగానే’ తెలుగువారికి నచ్చేసింది. ఇంకేముంది, అభిమాన వర్షం మొదలైంది. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల దాడులు తప్పించుకోడానికి ఈ కొడగు సుందరి గొడుగు చాటున సంచరించాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఊరు పేరు భైరవకోన’ తన తాజా చిత్రం.
వర్ష కథానాయిక అయితే.. డైలాగ్ రైటర్స్‌కు పెద్దగా పనే ఉండదు. కళ్లతోనే సంభాషణలు పలికించగలదు.
-సి.ఎం. ప్రవీణ్