జూలో ఏం జరుగుతోంది?
అటవీ శాఖ మంత్రి కొండా సు రేఖ ఇలాకాలోని వరంగల్ కాకతీయ జూపార్కులో ఏం జరుగుతోంది? వన్యప్రాణులు ఒక్కొక్కటి చనిపోతున్నాయి. ఏడాదిలోనే వరుసగా పెద్ద జంతువులు చనిపోయా యి.
- అటవీ శాఖ మంత్రి ఇలాకాలో వన్యప్రాణుల మరణాలు
- వరుసగా జంతువుల మృతి.. ఇటీవలే కరెంట్ షాక్‌తో ఎలుగుబంటి మృత్యువాత
- ఫిబ్రవరిలో అనారోగ్యంతో తెల్ల పులి.. కుక్కల వేటలో నాలుగు కృష్ణ జింకలు
- వరదలతో మూషిక జింకలు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
సుబేదారి, ఆగస్టు 12 : అటవీ శాఖ మంత్రి కొండా సు రేఖ ఇలాకాలోని వరంగల్ కాకతీయ జూపార్కులో ఏం జరుగుతోంది? వన్యప్రాణులు ఒక్కొక్కటి చనిపోతున్నాయి. ఏడాదిలోనే వరుసగా పెద్ద జంతువులు చనిపోయా యి. వారం క్రితం కరెంట్‌షాక్ తో ఎలుగుబంటి చనిపోగా, ఫిబ్రవరిలో తెల్లపులి అనారోగ్యానికి గురై వైద్యం అందక మృతి చెందింది. అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టకపోవడంతో ఎండాకాలంలో కాకతీయ జూపార్కులోకి ఊర కుక్కలు చొరబడి నాలుగు కృష్ణ జింకలను చంపేశాయి. గత వానకాలంలో వరదలతో మూషిక జింకలు మృత్యువాతపడ్డాయి. చనిపోయిన జంతువులను హడావుడిగా ఖననం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ తప్పు లేదని అధికారులు రిపోర్టులు ఇస్తున్నారని, అసలైన కారణాలను తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతున్నది.
పూర్తిస్థాయి అధికారి లేక పర్యవేక్షణ కరువు
జూపార్కుపై అటవీ శాఖ పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నది. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా జూన్‌లో బీట్ ఆఫీసర్ నుంచి జిల్లాస్థాయి ఫారెస్టు అధికారి వరకు ట్రాన్స్ఫర్ చేసింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సొంత ప్రాంతమైన వరంగల్ జూపార్కుకు పూర్తి స్థాయి అధి కారిని నియమించలేదు. భద్రాద్రి జోన్‌లోని మహబూబాబాద్ జిల్లా గంగారం ఫారెస్టు రేంజ్ అధికారి ఏడాదిన్నరగా జూపార్కులో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. డిప్యుటేషన్ పోస్టింగ్‌లను రద్దు చేయకుండానే రెండు నెలల క్రితం సాధారణ బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాధాన్యత కలిగిన వరంగల్ జూపార్కుకు రెగ్యులర్ అధికారిని నియమించకపోవడంతో పర్యవేక్షణ లేక జంతువులు చనిపోతున్నాయనే చర్చ జరుగుతున్నది.
పులులు వచ్చి పాయె..
1985లో 45 ఎకరాల్లో జూపార్కు ఏర్పాటైంది. మొదట్లో చిన్నగా ఉండగా, 2014లో స్మాల్ జూ కేటగిరీలో చేర్చారు. జంతువులు, క్షీరదాలు, సరిసృపాలు కలిపి 130, నెమళ్లు, చిలుకలు, అడవి కోళ్లు, లవ్ బర్డ్స్ కలిపి 195 జీవాలు ఉన్నాయి. 2024 డిసెంబర్లో రూ. లక్షలు ఖర్చుపెట్టి పెద్ద పులుల ఎన్‌క్లోజర్ నిర్మించారు. హైదరాబాద్ జూపార్కు నుంచి రాయల్ బెంగాల్ జాతికి చెందిన ఆడ, మగ పులులను తీసుకొచ్చారు. వీటితో జూపార్కుకు సందర్శకులు పెరిగారు. సెలవు ల్లో ఎక్కువ సందడిగా ఉండేది. కొద్ది నెలలకే పులి జంట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్ జూపార్కుకు తరలించారు. ఆ తర్వాత తెల్లపులి(చరణ్) తీసుకొచ్చారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో అదీ అనారోగ్యం బారిన పడి మృతి చెందింది. పెద్ద జంతువులు ఒక్కొక్కటిగా కనుమరుగవడంతో జూపార్కు కళ తప్పుతున్నది. రూ. కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసినా సందర్శలకు జంతువులను చూసి అహ్లాదపడే అవకాశం లేకుండా పోతున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

