బయ్యారం, డిసెంబర్19 : తాను పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవడానికి ముందుకొచ్చాడు ఓ శ్రీమంతుడు. ఊరికి ఉపకారం చేయాలని నిర్ణయించుకొని గ్రామస్తుల కోసం ఓ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నాడు. మండలంలో ని గంధంపల్లి గ్రామానికి చెందిన వెనిగళ్ల ఆనందప్రసాద్ వ్యాపార రీత్యా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. భవ్య క్రియేషన్స్ పేరుతో సినిమాలు తీశాడు. భవ్యసిమెంట్స్ అధినేతగా అనేక మందికి ఉద్యోగాలు కల్పించి వ్యా పారవేత్తగా ఎదిగాడు. ఎంత సంపాదించినా సొంత ఊరి కోసం సాయపడాలనే సంకల్పంతో ముందడుగు వేశాడు. మండలంలోని గంధంపల్లిలో 1.5ఎ కరాల్లో రూ.2.5కోట్లతో కల్యాణ మండపాన్ని నిర్మించాలని సంకల్పించి సోమవారం భూమి పూజ చేశాడు. కాగా, దానికి మండల ప్రజల సౌకర్యం కోసం ఉపయోగించనున్నట్లు ఆనందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్‌నాయక్, వైస్ ఎంపీపీ తాత గణేశ్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, గ్రామపెద్దలు శివయ్య, సురేశ్, సూర్యం, వెంకటేశ్వరరావు, భాస్కర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.