Bhupalapalli | భూపాలపల్లి జిల్లాలో దారుణం.. పట్టపగలే యువకుడిపై కత్తితో దాడి
Bhupalapalli | పట్టపగలే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
జయశంకర్ భూపాలపల్లి : పట్టపగలే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఒడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్య దాడికి పాల్పడ్డారు.
గణేష్ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకోగా దుండగులు వారిని చూసి పారిపోయారు. గణేష్ ఛాతిపై తీవ్ర గాయం కాగా అంబులెన్స్ లో భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

