Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Trishula Snanarchana | విజయదశమి దసరా పండుగ సందర్భంగా చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం రుద్రేశ్వరీదేవిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు.
హనుమకొండ చౌరస్తా : విజయదశమి దసరా పండుగ ( Dasara Festival ) సందర్భంగా చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం రుద్రేశ్వరీదేవిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. హంస వాహన సేవలో రుద్రేశ్వరీదేవిని కోనేరు వరకు వాహనసేవ నిర్వహించారు. అమ్మవారిని కోనేరులో వేదమంత్రాల మధ్య త్రిశూల స్నానార్చనను ( Trishula Snanarchana ) వైభవంగా జరిపించారు. అమ్మ చల్లనిచూపు అందరిపై ఉండాలని కోనేరు జలాలను భక్తులపై చల్లి ఆశీర్వదించారు
. అనంతరం సాయంత్రం భక్తులకు చిత్రాన్న ప్రసాద వితరణ, జమ్మివృక్ష పత్రాలు భక్తులకు అందజేశారు. త్రిశూల స్థానార్చనలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఉత్సవ సమితి సభ్యులు పల్లం రమేష్, కోన శ్రీకర్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, మణికంఠశర్మ, దత్తకుమార్శర్మ, ప్రణవ్ త్రిశూల స్థానార్చన వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

