విద్యార్థి స్కూల్ బ్యాగులో తాచుపాము
పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి స్కూల్ బ్యాగులోనుంచి తాచుపాము బయటపడడంతో విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
- నెక్కొండలో ఘటన
నెక్కొండ, ఫిబ్రవరి 6 : పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి స్కూల్ బ్యాగులోనుంచి తాచుపాము బయటపడడంతో విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన ఈదునూరి విజేందర్-మమత కుమారుడు వివేక్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే వివేక్ తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా బ్యాగులోంచి తాచుపాము బయటకు వచ్చింది.
వివేక్ వెనుక నడుస్తున్న తోటి విద్యార్థులు పాము పాము అని గట్టిగా అరవడం, ఇంతలో అది రోడ్డుపై వెళ్లిపోయింది. అయితే వివేక్ ఇంట్లోకి సోమవారం పాము వచ్చిందని, ఎంత వెతికినా ఇంట్లో దొరకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పాము స్కూల్ బ్యాగులోకి చేరి ఉంటుందని భావించారు. మొత్తానికి పాముతో ఎలాంటి హాని జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

