బీజేపీ మోసాన్ని ఎండగట్టాలి: ఎమ్మార్పీఎస్
బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు సంఘం నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ‘చలోఢిల్లీ మాదిగల లొల్లి’ కరపత్రాలను ఆవిష్కరించారు.
నర్సంపేట, డిసెంబర్ 4: బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు సంఘం నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ‘చలోఢిల్లీ మాదిగల లొల్లి’ కరపత్రాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఆరెపల్లి బాబు, మైసి శోభన్, వడ్డూరి కుమారస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిలీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టే ‘చలో ఢిల్లీ మాదిగల లొల్లి’ కార్యక్రమంలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్షుడు చిలుపాక బాబు, ఐలయ్య, ఉప్పలయ్య, తీగల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చలో ఢిల్లీని విజయవంతం చేయాలి
పోచమ్మమైదాన్(కాశీబుగ్గ): ఈ నెల 19న జరుగనున్న ‘చలో ఢిల్లీ మాదిగల లొల్లి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కాశీబుగ్గ జంక్షన్లో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిన మోసాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కేంద్రం వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే గద్దె దింపే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు తమ మద్ద తు ప్రకటించినట్లు తెలిపారు. 1977లో బీజేపీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి, తమ మేనిఫెస్టోలో ప్రకటించి ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. దళిత వ్యతిరేకి అయిన బీజేపీ కుల ఆధిపత్యం, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని ధ్వజమెత్తారు. కేదాసి మోహన్, వంగపల్లి శ్రీనివాస్, చిన్నస్వామి, భిక్షపతి, యాకోబు, జోసెఫ్, స్వామి, దయాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

