జనగామ చౌరస్తా : వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన నర్సమ్మ(65) అనే వృద్ధురాలు గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న తన కూతురు ఇంటికి బయలుదేరి, గుండ్లగడ్డ ఏరియాలో దారితప్పింది. సమాచారం అందుకున్న జనగామ అర్బన్ పోలీసులు వృద్ధురాలి వివరాలు అడుగగా, తన కూతురు పేరు సానబోయిన విజయ, అల్లుడి పేరు అశోక్, మనవడి పేరు సంపత్ అని తెలిపింది. దీంతో సానబోయిన సంపత్ పేరు మీద ఫేస్బుక్ ఐడీ సెర్చ్చేసి, అందులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా వృద్ధురాలు నర్సమ్మను తన మనవడు సానబోయిన సంపత్కు పోలీసులు శర్మ, సలావుద్దీన్ క్షేమంగా అప్పగించారు.
వృద్ధురాలు దారితప్పిన విషయాన్ని పోలీసులకు తెలిపిన గుండ్లగడ్డ ఏరియాకు చెందిన మహిళలను పోలీసులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.