క్రికెట్ నెట్స్‌కు ఫుల్ క్రేజ్
ఎక్కువమంది ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ ఆడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆడాలనే ఉత్సాహం ఉన్నా తీరిక లేక కొందరు.. వీలుదొరికినా ఆటస్థలం ఖాళీగా లేక మరికొందరు బ్యాట్ పట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు క్రికెట్ నెట్స్ అందుబాటులోకి వచ్చాయి.
- నగరంలో చాలాచోట్ల అందుబాటులో..
- ప్రాక్టీస్ చేసేందుకు సౌలభ్యం
- గంటకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు చార్జ్
- మ్యాచ్‌లతో చిన్నా, పెద్దా సందడి
ఎక్కువమంది ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ ఆడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆడాలనే ఉత్సాహం ఉన్నా తీరిక లేక కొందరు.. వీలుదొరికినా ఆటస్థలం ఖాళీగా లేక మరికొందరు బ్యాట్ పట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు క్రికెట్ నెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న నెట్ క్రికెట్ గ్రౌండ్స్ ప్రాక్టీస్ చేసేందుకు సౌలభ్యంగా ఉంటున్నాయి. ఇరువైపులా, వెనుక నెట్టింగ్తో చేసిన పిచ్‌లో ఎండ వేడి ఉన్నా ఇబ్బంది లేకుండా నిశ్చింతగా ఆడే వీలుండడంతో పాటు రాత్రిపగలూ తేడా లేకుండా మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. అభిమానుల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వరంగల్ నగరంలో పది వరకు క్రికెట్ నెట్స్ ఏర్పాటుచేయగా పిల్లలు, యువత వాటి వైపు పరుగులు తీస్తుండడంతో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది.
– హనుమకొండ చౌరస్తా, మే 28
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా క్రికెట్ నెట్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో క్రికెట్ నెట్స్ సందడి నెలకొంది. సమ్మర్ హాలీడేస్ కావడంతో క్రికెట్ మైదానాలు చాలా బిజీ గా కనిపిస్తున్నాయి. దీంతో నగరంలో నూతనంగా వెలుస్తున్న నెట్ క్రికెట్ మైదానాల వైపు క్రికెటర్లు క్రేజీ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో క్రికెట్ జోష్ బాగా పెరిగింది. చిన్నపిల్లల నుంచి వయస్సు తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మైదానాలు ఖాళీ లేకపోవడంతో నెట్ క్రికెట్ గ్రౌండ్స్‌కు పరుగులు తీస్తున్నారు. క్రికెట్ అభిమానుల కోసం నగరంలో సుమారు 10కిపైగా క్రికెట్ నెట్స్ ఉండటం విశేషం. ఇందులో ప్రొఫెషన ల్ క్రికెట్ నేర్చుకునే వారికి నెట్ సదుపా యం కలుగుతుంది. ఈ క్రికెట్ నెట్స్‌లో చిన్నపిల్లలే కాదు ప్రతి ఒక్కరూ క్రికెట్ నేర్చుకోవచ్చు. ఇందులో రాత్రి సమయంలో కూడా క్రికెట్ ఆడుకునే సదుపాయం కల్పిస్తున్నారు. బాల్ దూరం వెళ్లకుండా జాలీలతో కంచెలు వేసి ఉంటుంది. ఇందులో జట్లుగా ఏర్పడిన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లు ఆడుతున్నారు. క్రికె ట్ అభిమానుల కోసం క్రికెట్ నెట్స్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, గంటకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు ఛార్జ్ చేస్తున్నట్లు హంటర్‌రోడ్‌లోని ది స్ట్రీట్ హనుమకొండ క్రికెట్ నిర్వాహకుడు రాకేశ్‌రెడ్డి తెలిపా రు.
ప్రాక్టీస్‌కు అనువుగా..
క్రికెట్ నెట్లను బ్యాటర్లు, బౌలర్లు క్రికెట్ మెళకువలను సాధన చేసేందుకు ఉపయోగిస్తారు. ఇరువైపులా, వెనుక నెట్టింగ్ ద్వారా చుట్టబడిన క్రికెట్ పిచ్ కలిగి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్‌కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. బ్యాటర్ షాట్ కొట్టినప్పుడు మైదానం నుంచి వెళ్లకుండా క్రికెట్ బాల్‌ను నెట్లు ఆపుతాయి. వారి ప్రాక్టీస్ సమయం ఆదా అవుతుంది. ఫీల్డర్లు లేదా వికెట్ కీపర్ అవసరం ఉండదు. ఎక్కువమంది ప్లేయర్లు ఒకేసారి శిక్షణ పొందేందుకు అనుమతిస్తారు. ప్రత్యేకించి వారికి అనేక లేన్లు ఉన్నప్పుడు బౌలింగ్ గ్రీన్‌మ్యాట్ క్రికెట్ నెట్స్‌పై సిక్స్‌లు, ఫోర్లతో క్రికెటర్లు ఫుల్‌జోష్ నింపుతున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్ నేర్చుకోవచ్చు
క్రికెట్ నెట్స్ ద్వారా బ్యాటింగ్, బౌలింగ్ నేర్చుకోవచ్చు. సమ్మర్ హాలీడేస్‌లో గ్రౌండ్స్ ఖాళీగా ఉండటం లేదు. ఎక్కడచూసినా క్రికెట్ ప్లేయర్స్‌తో నిండిపోయి ఉంటున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ఇప్పుడు క్రికెట్ నెట్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలామంది ఇప్పుడు మన దగ్గర ఉన్న క్రికెట్ నెట్స్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నారు.
– సొల్లు సమిత్ప్రియన్, విద్యార్థి
నెట్ ప్రాక్టీస్ ఎంతో మేలు..
హైదరాబాద్ తరహాలో ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా క్రికెట్ నెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చాలామంది నెట్స్ ద్వారా క్రికెట్ నేర్చుకుంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమయం దొరికినప్పుడల్లా వెళ్లి క్రికెట్ ఆడుతున్నారు. మనం ఎంత కొట్టినా బాల్ అక్కడే ఉంటుంది. అలసిపోం, బ్యాటింగ్, బౌలింగ్ బాగా ప్రాక్టీస్ అవుతుంది.
– జి.తేజ, రెడ్డికాలనీ
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

