వాన ఆగినా.. వరద
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి నిండుగా నీటితో కళకళలాడుతోంది.
- మత్తడి దూకుతున్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు
- పొంగి ప్రవహిస్తున్న వాగులు.. ప్రవాహానికి కొట్టుకొస్తున్న చేపలు
- మత్స్యకారులకు పండుగే పండుగ.. సామాన్యులు సైతం ఉత్సాహంగా చేపల వేటకు..
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి నిండుగా నీటితో కళకళలాడుతోంది. అలాగే వరద ప్రవాహానికి పెద్ద సంఖ్యలో చేపలు కొట్టుకొస్తుండడంతో మత్స్యకారుల పంట పండినట్లయింది.


ఇంకేముంది మత్తడి వల్ల వలలు వేయగా చిన్నాచితకా చేపలే గాక పది, పదిహేను కిలోల బంగారు తీగ, గ్యాస్కట్, తదితర రకాలు చిక్కాయి.

దొరికిన చేపతో సెల్ఫీ దిగుతూ మురిసిపోయారు. ఇలా జనగామ, నర్సంపేట ప్రాంతాల్లో శుక్రవారం మత్సకారులతో పాటు సామాన్య ప్రజలు చేపల వేట సాగించడం కనిపించింది. వర్షాలు ఆలస్యంగా కురిసినా ఇటు రైతులు, మత్స్యకారుల ఉపాధికి జీవం పోశాయి.




Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

