ప్రేమకు కుల, మతాల అంతరాలు ఉండవు. కులం, మతం, హోదా చూసుకొని ఎవరూ ప్రేమించరు. కానీ, ప్రేమకు అడ్డు రాని కులమతాలు పెండ్లికి మాత్రం అడ్డుగా మారతాయి. ఈ అడ్డుగోడలను బద్దలు కొట్టలేక, వారి ప్రేమను వివాహబంధంగా మార్చుకోలేక చాలామంది ప్రేమికులు మధ్యలోనే తనువు చాలిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి వారికి ధైర్యం చెప్పి, దారి చూపిస్తోంది కుల నిర్మూలన సంఘం. ఈ సంఘం వేలాది కుల, మతాంతర వివాహాలు జరిపిస్తూ ప్రేమకు కుల, మతాలు అడ్డు కాదని నిరూపిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా కుల నిర్మూలన సంఘంపై ప్రత్యేక వీడియో మీ కోసం..