INSTASHIELD | కొవిడ్-19 సహా అన్నిరకాల వైరస్లను క్షణాల్లో చంపగలిగే అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణవాసి మండాజి నర్సింహాచారి.దీని పేరు ‘ఇన్స్టా షీల్డ్’. ఇందులో వాడిన టెక్నాలజీకి సీసీఎంబీ అనుమతి లభించడం, ఇలాంటిది దేశంలోనే మొదటిది కావడం విశేషం. ఈ పరికరాన్ని ఆన్ చేయగానే ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. వైరస్ను చంపడంలో అతితక్కువ సమయం తీసుకొన్న పరికరంగా ఇది రికార్డు సాధించింది. ఈ టెక్నాలజీని సీసీఎంబీ స్వయంగా పరిశీలించి నర్సింహాచారితో ఒప్పందం చేసుకొన్నది. సీసీఎంబీ సహకారంతో ఈ పరికరాన్ని ఇన్స్టాషీల్డ్ అనే హైదరాబాదీ సంస్థ ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. స్కూళ్లు, హాస్పిటల్స్, మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నది.
మరి ఈ పరికరం ఎలా పనిచేస్తుంది? వైరస్ను ఎలా నిర్వీర్యం చేస్తుంది? ఇందుకోసం ఎంత సమయం తీసుకుంటుంది ? వంటి విషయాలను ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..