Viral Video | పాలు అమ్మేవాళ్లు ఏ చిన్నపాటి బైక్, విక్కీ, సైకిల్పైనో ఇంటింటికీ వెళ్లి పాలు పోయడం మనం ఇప్పటి దాకా చూశాం. చాలా మంది పాలు అమ్మేందుకు ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేందుకు ఏకంగా ప్రీమియం బైక్ హార్లే డేవిడ్సన్ను ఉపయోగించాడు. ఆ బైక్కు రెండు వైపులా పాల క్యాన్లను తగిలించుకుని వీధుల్లో చక్కర్లు కొడుతూ.. ఇంటింటికీ వెళ్లి పాలుపోస్తున్నాడు.
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, అమిత్ బదనా అనే వ్యక్తి డిసెంబర్ 18వ తేదీన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతన్నారు. ‘పాలు అమ్మేందుకు రూ.11 లక్షలకు పైనే విలువ చేసే బైక్ను వాడాలా..’ అంటూ నోరెళ్లబెడుతున్నారు.