పరారీలో ఉన్న ఓ దొంగ రోడ్డుపై కారులో 160 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు కుక్కతో కలిసి అతడి వెనుక పెట్రోలింగ్ జీప్‌లో వెంబండించారు. దీంతో ఆ దొంగ అకస్మాత్తుగా కారు ఆపి పోలీసులకు లొంగిపోయాడు. కుక్కను చూసి భయపడే తాను లొంగిపోతున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు యూట్యూబ్‌లో పెట్టగా, వైరల్ అవుతోంది.
హోవార్డ్(28) అనే దొంగ ఓ అల్ట్రామోడల్ కారులో వేకువజామున రోడ్డుపై 160కిలోమీటర్ల దూరంతో దూసుకుపోతుండగా, పోలీసుల కంటపడ్డాడు. వెంటనే పోలీసులు గన్నర్ అనే పోలీస్ డాగ్‌ను తీసుకుని అతడిని పెట్రోలింగ్ జీప్‌లో వెంబండించారు. తమతో ప్రమాదకరమైన కుక్క ఉన్నదని, దొరికితే కరిచిచంపుతుందని హెచ్చరించారు. దీంతో భయపడ్డ హోవార్డ్ వెంటనే కారు ఆపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.