న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10టీ ఆగస్ట్ 3న భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనంది. వన్‌ప్లస్ ఫోన్లలో తొలిసారిగా వన్‌ప్లస్ 10టీ 16జీబీ ర్యాంతో కస్టమర్ల ముందుకు రానుంది. వన్‌ప్లస్ ఫోన్లు 256జీబీ స్టోరేజ్‌తో మనం చూసినా 16జీబీ ర్యాంతో మాత్రం అందుబాటులో లేవు. రానున్న 10టీ కస్టమర్లకు మల్టీటాస్కింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రాబోయే వన్‌ప్లస్ 10టీ సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్టమ్‌ను కలిగిఉంది.
లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+జెన్ 1 ప్రాససర్‌తో గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌తో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందుభాగంలో పంచ్ హోల్ డిజైన్‌తో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ చేసేందుకు సింగిల్ కెమెరా ఏర్పాటు చేశారు. రియర్ భాగంలో ఫోన్లో ఓఐఎస్ సపోర్ట్‌తో ప్రైమరీ 50ఎంవీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌ను కలిగిఉంది.
8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, టూ మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాలున్నాయి. ఇక 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఇక ఇక వన్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్ ఆక్సిజన్ఓఎస్ 12 అవుటాఫ్ ది బాక్స్ ధరకు లభిస్తుంది. వన్‌ప్లస్ 10టీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ 49,999 నుంచి ప్రారంభమవుతోంది.