Alligator | ఆలిగేటర్.. పరిచయం అక్కర్లేని పేరు. నీళ్లలో ఉంటూ జీవనం సాగిస్తుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. మనిషి కానీ, జంతువు కానీ దాని నోటికి చిక్కారో అంతే సంగతులు. తీవ్రంగా గాయపడటమో ప్రాణాలు కోల్పోవడమో ఖాయం. అంత ప్రమాదకరమైన మొసలిని ఓ వ్యక్తి ఏకంగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి పేద్ద ముసలిని పట్టుకోవాలనుకుంటాడు. ముందుగా దాని ముఖంపై షర్ట్‌ని వేస్తాడు. దగ్గరగా వెళ్లి దాని ముఖం పట్టుకునేందుకు చెయ్యి వేస్తాడు. అంతే ఆలిగేటర్ ఒక్కసారిగా అతనిపైకి విరుచుకుపడుతుంది. సదరు వ్యక్తి చెయ్యిని అమాంతం నోట్లోకి వేసుకుంటుంది. దీంతో అతను దాన్నుంచి తప్పించుకుంటాడు. ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.