న్యూఢిల్లీ : ఓ ఫంక్షన్లో మధ్యవయసు వ్యక్తి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరలవుతోంది. సందీప్ కుమార్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 35 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో కుర్తా పైజమా ధరించిన ఓ మధ్యవయస్కుడు ఫంక్షన్‌లోని డ్యాన్స్ ఫ్లోర్లో హర్ధీ సంధు పాపులర్ ట్రాక్‌కు దుమ్మురేపే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అతడి ఎక్స్ప్రెషన్స్, కిల్లర్ స్టెప్స్ అందరిలో ఉత్తేజం నింపాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టవుతూ అంకుల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతమని కొనియాడారు. వావ్, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేయగా గురూజీ ఆన్ ఫైర్ అంటూ మరో యూజర్ ప్రశంసించారు.