Pizza eating ways: పిజ్జాను ఇలా ఐదు విధాలుగా తినవచ్చట.. ఫన్నీ వీడియో
Pizza eating ways: పిజ్జా..! ఇప్పుడు భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వంటకాన్ని ఇష్టపడేవాళ్లు ఉన్నారు. బ్రెడ్, టొమాటో సాస్, చీజ్ మొదలైన వాటిని వినియోగించి చేసే ఈ పిజ్జాను కొంతమంది బోజన ప్రియులు

హైదరాబాద్: పిజ్జా..! ఇప్పుడు భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వంటకాన్ని ఇష్టపడేవాళ్లు ఉన్నారు. బ్రెడ్, టొమాటో సాస్, చీజ్ మొదలైన వాటిని వినియోగించి చేసే ఈ పిజ్జాను కొంతమంది బోజన ప్రియులు ఆవురావురుమంటూ ఆరగిస్తారు. అయితే ఈ పిజ్జాల్లో రకరకాల వేరియేషన్లు ఉన్నాయి. ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ పిజ్జాలను తయారు చేస్తున్నారు. భారత రెస్టారెంట్లలో పైన పనీర్ టిక్కాతో గార్నిష్ చేసి డెలీషియస్ పిజ్జాలను తయారు చేస్తున్నారు.
అయితే, ఈ పిజ్జాలను ఐదు విధాలుగా తినవచ్చంటూ ఇటీవల ఓ వ్యక్తి ఫన్నీ వీడియో చేశారు. ఎమిలియానో, మెటియో అనే ఇద్దరు మ్యుజీషియన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ స్టా హ్యాండిల్లో ఆ వీడియోను పోస్టు చేశారు. వీడియోలో వ్యక్తి ముందుగా నార్మల్ వే అంటూ ఓ పిజ్జాను ఎడమచేతిలో పట్టుకుని, నోటితో కొరికి చూపించాడు. ఆ తర్వాత న్యూయార్క్ స్టైల్ అంటూ కుడిచేతిలో పిజ్జాను సగానికి మడిచి పట్టుకుని తిని చూపించాడు. ఆ తర్వాత సైకో వే అంటూ మరో పద్ధతిని చూపెట్టాడు. ఈ పద్ధతిలో పిజ్జాను తిప్పిపట్టుకుని వెనుక వైపు నుంచి కొరికాడు.
ఇక ఆఖరుగా కరెక్ట్ వే అంటూ మరో పద్ధతిని ప్రదర్శించాడు. ఈ పద్ధతిలో పిజ్జాను పూర్తిగా చుట్టేశాడు. దాంతో పిజ్జాపైన చల్లిన పదార్థాలన్నీ లోపలికి వెళ్లిపోయాయి. అతను బయటి నుంచి దాన్ని తినడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 31 లక్షల వ్యూస్ సాధించింది. అంతేగాక 2.70 లక్షల లైకులు వచ్చాయి. సరదాగా చేసిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

