Fire Haircut | ‘ఫైర్ హెయిర్‌కట్’ చేస్తుండగా… యువకుడికి గాయాలు
Fire Haircut | కేశాల అలంకరణ కోసం ఇటీవల కాలంలో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా సెలూన్లు సైతం పలు రకాల హెయిర్ కట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్, ఫ్లాట్ కట్ ఇలా రకరకాలుగా యువత తమ జుట్టును స్టైల్‌గా కట్ చేయించుకుంటుంటారు. వీటిని ఒక్కోదాన్ని ఒక్కో విధంగా కట్ చేస్తారు. అయితే, ప్రస్తుతం ‘ఫైర్ హెయిర్‌కట్’ అనేది ట్రెండ్ అవుతోంది. ఈ ఫైర్ హెయిర్ కట్ చేయించుకోవడం అంటే సాహసంతో కూడుకున్నదే. మంటను ఉపయోగించి కేశాలను మనకు కావాల్సిన స్టైల్లో సెట్ చేస్తారన్న మాట. ఈ పద్ధతిలో ఏమాత్రం పట్టుతప్పినా గాయాలుపాలు కావాల్సింది. అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది.
Fire Haircut | కేశాల అలంకరణ కోసం ఇటీవల కాలంలో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా సెలూన్లు సైతం పలు రకాల హెయిర్ కట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్, ఫ్లాట్ కట్ ఇలా రకరకాలుగా యువత తమ జుట్టును స్టైల్‌గా కట్ చేయించుకుంటుంటారు. వీటిని ఒక్కోదాన్ని ఒక్కో విధంగా కట్ చేస్తారు. అయితే, ప్రస్తుతం ‘ఫైర్ హెయిర్‌కట్’ అనేది ట్రెండ్ అవుతోంది. ఈ ఫైర్ హెయిర్ కట్ చేయించుకోవడం అంటే సాహసంతో కూడుకున్నదే. మంటను ఉపయోగించి కేశాలను మనకు కావాల్సిన స్టైల్లో సెట్ చేస్తారన్న మాట. ఈ పద్ధతిలో ఏమాత్రం పట్టుతప్పినా గాయాల పాలు కావాల్సింది. అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది.
వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో గల భడక్మోరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ‘ఫైర్ హెయిర్ కట్’ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అక్కడ ‘ఫైర్ హెయిర్ కట్’ చేయించుకుంటుండగా.. తల భాగంలో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. మంటను అదుపు చేసే క్రమంలో యువకుడి మెడ, శరీరంపై గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అతన్ని వెంటనే వల్సాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని సూరత్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారి కరమ్‌సింగ్ మక్వానా తెలిపారు. జుట్టును కత్తిరించే ప్రక్రియలో భాగంగా యువకుడి తలపై ఓ రకమైన రసాయనాన్ని పూశారని.. దాని కారణంగానే తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ‘ఫైర్ హెయిర్‌కట్’ కోసం ఏ రసాయనాన్ని వినియోగించారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మక్వానా వెల్లడించారు.
An 18-year-old man suffered severe burn injuries after his ”fire haircut” went wrong at a salon in Vapi town of Gujarat’s Valsad district#valsad #fire_haircut #ViralVideo #viralvideos2022 pic.twitter.com/K4ALzdGyq5
— Ravi kumar (@ravikumar455) October 27, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

