Viral Video | ఓ ఆవు బట్టల దుకాణానికి వెళ్లింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం (Assam)లోని దుబ్రి (Dhubri) ప్రాంతంలో గల ఓ బట్టల దుకాణంలోకి ఆవు ప్రవేశించింది. అటూ ఇటూ తిరుగుతూ.. స్టోర్ మొత్తం ఓ రౌండ్ వేసేసింది. అనంతరం దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. ఇది గమనించిన దుకాణ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ చివరి వారంలో జరగ్గా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1
— Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022